Homeవార్తలుతెలంగాణజిల్లా ఆసుపత్రులలో సరైన సదుపాయాలు  లేక అల్లాడుతున్న గర్భిణీలు, వ్యాధిగ్రస్తులు

జిల్లా ఆసుపత్రులలో సరైన సదుపాయాలు  లేక అల్లాడుతున్న గర్భిణీలు, వ్యాధిగ్రస్తులు

జిల్లా ఆసుపత్రులలో సరైన సదుపాయాలు  లేక అల్లాడుతున్న గర్భిణీలు, వ్యాధిగ్రస్తులు

న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా ఆసుపత్రులలో క్రిటికల్ కేర్ యంత్రాలు పనిచేయక గర్భిణీలను హైదరాబాద్ లేక మహబూబ్నగర్ పంపుతున్నారని ఈ మధ్యన ఒక గర్భిణీ స్త్రీ మధ్యలోనే చనిపోయినట్లుగా తెలుస్తుందని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ తెలిపారు
టీ హబ్ లో ఎలుకలు కొరికి పాడైపోయా అని చెప్తున్న బయో కెమిస్ట్రీ మిషన్, థైరాయిడ్ మిషన్ వెంటనే రిపేర్ చేయించాలని, అవి ఎలుకలు కొరకలేదని కొందరు ప్రైవేటు ఆసుపత్రి కి లోపాయికారీ వ్యాపారం ద్వారా టెస్టులు బయట ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులకు పంపాలని నిర్ణయంతో అవి పాడు చేశారని తెలుస్తుంది. జిల్లా ఆస్పత్రులకు చైర్మన్ అయిన కలెక్టర్ వెంటనే పట్టించుకుని.. క్రిటికల్ కేర్ విభాగం ప్రారంభించి గర్భిణీ స్త్రీలకు, పేషెంట్లకు ఇబ్బందులు లేకుండా చేయాలని అలాగే స్కానింగ్ యంత్రాలు పనిచేయకపోవడంతో కొందరు డాక్టర్లు వారు నిర్మించుకుని పనిచేస్తున్న ఆస్పత్రులకు దొడ్డిదారిన పంపుచున్నారని, కాంట్రాస్ట్ సిటీ Apdamin టెస్ట్ లేదని అల్ట్రా స్కాన్ టెస్టులకు ప్రైవేట్ హాస్పిటల్ కు పంపుతున్నారని, బయట స్కానింగ్ సెంటర్లలో 50% కమిషన్ పొందుతున్నారని దీనిపై విచారణ చేసి వెంటనే ఆయా డాక్టర్లపై, ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ లపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తుందనీ తెలిపారు. టీహబ్ లో గైనిక్ లో 15 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఖాళీగా ఉందని, రియల్ లిస్ట్ రేడియాలిస్ట్ తో సహా ముగ్గురు డాక్టర్లు కొరత ఉంది, ముఖ్యంగా సూపర్డెంట్ పోస్టు ఖాళీ ఉండడం వల్లనే ఈ అనర్ధాలకు కారణం అని, వాటిని పూరించి, పేషెంట్లను రక్షించాలని సతీష్ యాదవ్ కోరారు.
ఈ కార్యక్రమంలో డా” సతీష్ యాదవ్ తో పాటు కొత్తగొల్ల శంకర్, వెంకటేశ్వర్లు, రామస్వామి, గౌనీకాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, శివకుమార్, G.T శ్యామ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. (Story :జిల్లా ఆసుపత్రులలో సరైన సదుపాయాలు  లేక అల్లాడుతున్న గర్భిణీలు, వ్యాధిగ్రస్తులు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!