మొంథా తుఫాన్ బాధితులకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ చేయూత
న్యూస్ తెలుగు/వినుకొండ : మొంథా తుఫాన్ కారణంగా సంభవించిన వరదల్లో తీవ్రంగా నష్టపోయిన వినుకొండ మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీలోని అరుంధతీ కాలనీ మరియు రజక కాలనీలలోని 200కు పైగా కుటుంబాలకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అండగా నిలిచారు. శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధితులకు సహాయ సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి కుటుంబానికి రెండు దుప్పట్లు,రెండు చీరలు,వారిలో కొంతమందికి బియ్యం బస్తా నిత్యావసర సరుకులు అందించారు. అంతేకాకుండా, బాధితులకు ఆర్థిక తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో, ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తికి చొప్పున రూ. 1,000/నగదును కూడా పంపిణీ చేశారు. వరద బాధితులకు తక్షణ ఉపశమనం కలిగించేందుకు జీవీ చేసిన ఈ విశాల హృదయంతో కూడిన సహాయం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పరిశీలకులు మానుకొండ శివప్రసాద్ , నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.(Story :మొంథా తుఫాన్ బాధితులకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ చేయూత )

