Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌సాలూరులో వరి పంటకు భారీ నష్టం

సాలూరులో వరి పంటకు భారీ నష్టం

సాలూరులో వరి పంటకు భారీ నష్టం

న్యూస్ తెలుగు/సాలూరు : మండలం లో సుమారు 120 ఎకరాలు వరి పంటకు నష్టం జరిగిందని ఎంపిడిఓపార్వతీ ఏ ఓ కే శిరీష,తెలిపారు. బుధవారం సాలూరు మండలం పెదపదం గ్రామం లో తుఫాన్ ప్రభావం వలన పడిపోయిన వరి పంటను పరిశీలించారు.అలానే సహాయ వ్యవసాయ సంచాలకులు వారు మామిడిపల్లి గ్రామం లో పడిపోయిన వరి పంట పరిశీలించడం జరిగింది.వరి పొలం లో అధిక నీరు పొలంలో నిలబడకుండా నీరు బయటికి పంపించే విధంగా చిన్న కాలువలు ఏర్పాటు చేసుకోవాలని తెలియచేయడం జరిగింది, వరి పాలు పోసుకునే దశలో ఉంటే గింజ రంగు మారకుండా మానిపండు తెగులు రాకుండా ఎకరాకు 200 ml ప్రాపికానిజోల్ స్ప్రే చేయాలని తెలియజేశారు. అలాగే గింజ గట్టి పడే దశలో ఉంటే కంకిలో మొలకలు కనబడితే 5% ఉప్పు ద్రావణం అంటే 50 గ్రాములు గడ్లుప్పు లీటర్ నీటికి చల్లాలని ఇది మొలకలు రంగు మార్పులు తగ్గిస్తుందని తెలియజేశారు, సుమారు 9 గ్రామాల్లో వరి 120 ఎకరాల వరకు ప్రాథమిక నష్టం అంచనా వేసినట్లు వ్యవసాయ అధికారులు తెలియజేశారు, వారి వెంట సిబ్బంది ఉన్నారు.(Story : సాలూరులో వరి పంటకు భారీ నష్టం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments