వృద్ధురాలి మృతికి నివాళులర్పించిన
న్యూస్ తెలుగు/వినుకొండ : మొంథా తుఫాన్ కారణంగా వినుకొండ పట్టణం 18వ వార్డు, పప్పు బజార్ లో మారేటి రాములమ్మ (90) వృద్ధురాలు బుధవారం ఉదయం వర్షానికి ప్రమాదవశాత్తు గోడకూలి మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వృద్ధురాలి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని, తక్షణ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు నాయకులు, అధికారులు వెంట ఉన్నారు.(Story : వృద్ధురాలి మృతికి నివాళులర్పించిన )

