Homeవార్తలుతెలంగాణప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

న్యూస్ తెలుగు/వనపర్తి : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ప్రభుత్వం ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. బుధవారం చిట్యాల మార్కెట్ యార్డ్ లో జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే మేఘా రెడ్డితో కలిసి ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆ వెంటనే వరి ధాన్యం సంచిని తూకం చేసి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ప్రభుత్వం ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని అన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే తెలియజేశారు. ప్రభుత్వం సన్న రకాలకు రూ. 500 బోనస్ ఇస్తుందని చెప్పారు. కాబట్టి రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే తమ వరి ధాన్యాన్ని విక్రయించాలని ఎమ్మెల్యే తెలియజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వరి ధాన్యం విక్రయించడానికి కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు నిర్వాహకులు సహకరించాలని సూచించారు. రైతులు పంట తెచ్చిన రోజు రిజిస్టర్లలో ఏ రోజు తెచ్చారు, తెచ్చినప్పుడు ఎంత తేమశాతం ఉంది అనే వివరాలను నమోదు చేసుకుని, సీరియల్ నెంబర్ల వారీగా కొనుగోలు చేసి పంపించాలన్నారు. బరువు కొల్చే యంత్రాలు, తేమ యంత్రాలు అందుబాటులో ఉంచుకొని ఎప్పటికప్పుడు ధాన్యాన్ని కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను దళారులకు అమ్మి నష్టపోవద్దని సూచించారు. వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియడం లేదని కావున కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లను అందుబాటులో ఉంచుకోవాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే అక్కడే ఉన్న వరి ధాన్యం ఆరబెట్టే యంత్రాన్ని పరిశీలించి దానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఎమ్మెల్యే, కలెక్టర్ ని షాలువాతో సత్కరించారు.కార్యక్రమంలో అదనకు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, డి ఆర్ డి ఓ ఉమాదేవి, మార్కెటింగ్ అధికారి స్వరన్ సింగ్, నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
(Story : ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!