Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌జడ్పీ హైస్కూల్ కు ఆర్ ఓ వాటర్ ప్లాంట్ ను వితరణ చేసిన గంగినేని రామయ్య..

జడ్పీ హైస్కూల్ కు ఆర్ ఓ వాటర్ ప్లాంట్ ను వితరణ చేసిన గంగినేని రామయ్య..

జడ్పీ హైస్కూల్ కు ఆర్ ఓ వాటర్ ప్లాంట్ ను వితరణ చేసిన గంగినేని రామయ్య..

న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక ఎన్ ఎస్ పి కాలనీ లోని జడ్పీ హై స్కూల్ కు ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను దాత గంగినేని రామయ్య సహకారంతో ఏర్పాటు చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ వీరప్పయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రముఖ వ్యాపార వేత్త గంగినేని రామయ్య వారి సోదరుడు గంగినేని వెంకటేశ్వరరావు, వినుకొండ మాజీ శాసనసభ్యులు మరియు మాజీ సమితి అధ్యక్షులు వారి జ్ఞాపకార్ధం 2 లక్షల రూపాయలు తో పాఠశాల విద్యార్థులకు త్రాగునీటి ఆర్ ఓ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. పాఠశాలలో 420 మంది బాల,బాలికలు చదువుతున్నారని ,వారందరికి త్రాగు నీటిని ఏర్పాటు చేసి వారి దాహార్తిని తీర్చినందుకు దాతకు ధన్యవాదాలు తెలిపారు. కొత్తగా ఏర్పాటు అయిన పాఠశాలకు ప్రాధమిక సదుపాయాల అవసరం ఉందని ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన దాతకు మరియు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో చొరవ తీసుకున్న పాఠశాల పీడీ రాధాకృష్ణ మూర్తి లను అభినందించారు. ఈ సందర్భంగా దాత గంగినేని రామయ్య మాట్లాడుతూ. ప్రతిరోజూ విద్యార్థులు త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని పాఠశాల పీడీ రాధా కృష్ణ మూర్తి తన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే విద్యార్ధుల దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో మరియు ప్రభుత్వ చీఫ్ విప్, మరియు వినుకొండ శాసనసభ్యులు జి.వి ఆంజనేయులు జన్మ భూమి స్పూర్తి తో ప్రజలకు చేస్తున్న సేవాకార్యక్రమాల స్పూర్తి తో తన సోదరుడు జ్ఞాపకార్ధం ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం సంతోషం గా ఉందని తెలుపుతూ గతంలో తన సోదరుడు శాసనసభ్యులుగా వున్నప్పుడు సమాజం మరియు వ్యక్తులు అభివృద్ధి చెందాలంటే చదువు అనే ఆయుధం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందని గ్రహించి ఆరోజులలో వినుకొండ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పాఠశాలలను ఏర్పాటు చేశారని వారికి చదువుకుంటున్న విద్యార్థుల పై గల ప్రేమను గుర్తుచేసుకుంటూ పాఠశాలలో ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాఠశాల పీడీ రాగుల రాధాకృష్ణ మూర్తి మాట్లాడుతూ. పాఠశాల లో చదువుతున్న విద్యార్ధుల త్రాగునీటి సమస్యను గతంలో గంగినేని రాఘవ ద్వారా ప్రతి రోజూ బయట నుండి కాన్లు ద్వారా ఏర్పాటు చేశామని శాశ్వతంగా త్రాగునీటి సమస్య ను తీర్చాలని గంగినేనీ రామయ్య దృష్టికి తీసుకెళ్లిన వెంటనే వారు ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసినందుకు వారికి పాఠశాల తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం వాటర్ ప్లాంట్ బిగించి ట్రైల్ చూశారు. దసరా సెలవులు అనంతరం విద్యార్థినిలకు వాటర్ ప్లాంట్ పూర్తిగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రైమరీ స్కూల్ హెచ్ఎం ఎన్. పద్మజ, ఎలీషా, ఎలిజబెత్ రాణి, గోవిందు నాయక్, రాంబాబు, చంద్రశేఖర్, శాంతి, రామాంజనేయులు, మల్లయ్య , గాయిత్రి, కోటిరత్నం,సంధ్య, వార్డెన్ రేణుకమ్మ, సిఆర్పి విశ్వనాధమ్ లు పాల్గొన్నారు. (Story:జడ్పీ హైస్కూల్ కు ఆర్ ఓ వాటర్ ప్లాంట్ ను వితరణ చేసిన గంగినేని రామయ్య..)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!