వెల్లటూరు గణిత ఉపాధ్యాయుడికి డాక్టరేట్
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ నియోజకవర్గం లోని బొల్లాపల్లి మండలం, వెల్లటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా సేవలందిస్తున్న ఏకేవీ ప్రకాష్ గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో షెపర్డ్ థియోలాజికల్ సెమినరీ వారి ద్వారా డాక్టరేట్ పట్టా అందుకున్నారు. విద్యారంగంలోనే కాకుండా ఆధ్యాత్మిక సేవా రంగంలోనూ కృషి చేస్తున్న ప్రకాష్ కృషిని గుర్తించి ఈ గౌరవాన్ని ప్రదానం చేసినట్లు సెమినరీ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుని శ్రీమతి బ్యూల హోసన్న అభినందిస్తూ సమాజానికి ఇటువంటి ఉపాధ్యాయులు ఎంతో అవసరం అన్నారు. ఎస్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి యు. చంద్రజిత్ యాదవ్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ గ్రామీణ ప్రాంతంలో ఉపాధ్యాయ వృత్తిలో నిబద్ధతతో పనిచేస్తూనే, ఉన్నత విద్యలో కూడా అత్యున్నత స్థాయి సాధించడం సమాజానికి స్ఫూర్తిదాయకం అని అన్నారు. ప్రకాష్ డాక్టరేట్ సాధనపై సహోద్యోగులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ, ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. (Story:వెల్లటూరు గణిత ఉపాధ్యాయుడికి డాక్టరేట్)

