నకిలీ సందేశాలకు ఎవరూ స్పందించవద్దు
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
న్యూస్తెలుగు/ వనపర్తి : కొందరు సైబర్ నేరగాళ్లు నకిలీ సందేశాలను పంపిస్తున్నారని, వాటికి ఎవరు స్పందించవద్దని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలియజేశారు.
సైబర్ నేరగాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ నేడొక ప్రకటనలో తెలియజేశారు. +84 329196048 అనే నెంబర్ నుంచి పలువురు తహసీల్దార్లకు కలెక్టర్ ఫోటోతో నకిలీ సందేశాలు వెళ్లిన నేపథ్యంలో ఈ ప్రకటన చేసినట్లు తెలిపారు. (Story:నకిలీ సందేశాలకు ఎవరూ స్పందించవద్దు )

