UA-35385725-1 UA-35385725-1

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

రాజీనామా చేసిన పిల్లా విజయకుమార్, అవనాపు విజయ్, గాడు అప్పారావు
నగరానికి పట్టిన ఎమ్మెల్యే పీడను వదిలించడమే ధ్యేయమంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

విజ‌య‌న‌గ‌రం (న్యూస్ తెలుగు) : విజ‌య‌న‌గ‌రం జిల్లాలో వైసీపీని ఒక్కొక్క‌రుగా వీడుతున్నారు. వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు పిల్లా విజయకుమార్, యువజన విభాగం నాయకులు అవనాపు విజయ్, మాజీ కౌన్సిలర్ గాడు అప్పారావులు అనూహ్యంగా రాజీనామా చేశారు. మంగళవారం అవనాపు విజయ్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ముందుగా అవనాపు విజయ్ మాట్లాడుతూ, 2009లో మొదటిసారి జగన్ కి చేదోడు వాదోడుగా ఉన్నామన్నారు.
వై ఎస్ మరణం తర్వాత ఒదార్పు యాత్రకు అన్ని విధాలా అండగా ఉన్నామాన్నారు.అనేక సేవలు, కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఆనాడు బొత్స సత్యనరాయణను, అశోక్ ను ఎదుర్కొని నిలబడ్డామన్నారు. 2011లో సమన్వయ కర్తగా ఉన్నాను. నేను సిఎం అవ్వడం ముఖ్యమని కోలగట్ల టికెట్ ఇస్తే అండగా నిలబడాల‌ని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు ఆనాడు కోలగట్ల గెలుపుకోసం పని చేయడం జరిగిందన్నారు. ఆస్తులు పోగొట్టుకొనీ, అనేక సేవలు వైసిపికి అందించడం జరిగిందన్నారు. మాకు పార్టీలో ఇసుమంత ప్రాధాన్య‌త ఇవ్వ‌కుండా కోలగట్ల అవమాన పరిచారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం పని చేసిన మా భవిష్యత్ రాజకీయాలకు అన్యాయం చేయడం జరిగిందన్నారు. వైసిపి నాయకులు విజయసాయి రెడ్డి,. సుబ్బారెడ్డి ని, అదే విధంగా జిల్లా నాయకులు బొత్సకు, మజ్జి శ్రీనివాసరావు కి ఎమ్మెల్యే విషయంలో ఫిర్యాదులు చేయ‌డం జరిగిందన్నారు. అయినా వారెవ్వరూ పట్టించుకోలేదు అన్నారు. అందుకే రాజీనామా చేసి టిడిపిలో చేరడానికి సిద్దంగా ఉన్నామన్నారు.
పిల్లా విజయకుమార్ మాట్లాడుతూ వైసిపి పుట్టినప్పుడు అధ్యక్షులుగా అవనాపు సూరిబాబు ఉన్నారు. తర్వాత చేరికల్లో మేము చేరడం జరిగిందన్నారు. 2014 తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికలు లో పార్టీ టిక్కెట్లు ఇవ్వలేదు. సాంబశివరాజు కూడా 40 వార్డుల్లో అభ్యర్ధులను ప్రకటించి నిలబెట్టడం జరిగిందన్నారు. ఆ ఎన్నికల్లో అవనాపు చిన్నమ్మలు, గంటా చినతల్లిని కౌన్సిలర్ల గా గెలిపించడంలో అవనాపు కుటుంబం ప్రధాన పాత్ర అన్నారు. సమాఖ్య ఆంధ్రలో అనేక పోరాటాలు చేయడం జరిగిందన్నారు. పదవులతో రాజకీయం చేయాలనే ఆలోచనతో ఎమ్మెల్యే కోలగట్ల పని చేశారన్నారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే కోలగట్ల ఓడిపోవడంతో ఆయన అక్కడినుంచి పార్టీ జిల్లా బాధ్యతలు చేపట్టి అవనాపు కుటుంబ సభ్యులను తొక్కే పెట్టే ప్రయత్నం చేయడం జరిగిందన్నారు. ఆనాడు విజయ్ నా తర్వాత నాయకుడు అని చెప్పి రాజకీయంగా అభివృద్ది చేయాలని చెప్పి కుత్సిత బుద్ధితో నియంతలా వ్యవహరించి పార్టీ నుంచి దూరం చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ లో ఉంటూ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో ఏదో ఒక పార్టీలో కి వెళ్ళాలని చెప్పి మంత్రి బొత్స 2015 లో చెప్పడంతో ఆయనతో పాటు వైసిపి లో చేరడం జరిగిందన్నారు. పార్టీలో గ్రూపులు పెట్టి ముక్కలు చేసే ప్రయత్నం చేయడం కోలగట్ల ద్వారా జరిగిందన్నారు. పార్టీ కోసం క్రమశిక్షణతో ఉన్న వారిమి కనుక 2019 ఎన్నికల్లో పూర్తి సహాయం చేయడం జరిగిందన్నారు. తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 10 సీట్లు అడిగినా ఎమ్మెల్యే ఇవ్వలేదన్నారు. నాడు మంత్రి బొత్స చేతులెత్తేశారు. అయినా 48 వైసిపి కార్పొరేటరలు సీట్లు రావడానికి సహకరించామన్నారు. నేడు కుళాయి, రోడ్డు కావాలన్నా ఎమ్మెల్యే ఇవ్వడం తప్ప, కార్పొరేటర్లుకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా నియంతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. 60 వేలు మంది కాపులు, 40 వేలు మంది యాదవులు, 30 ఎస్సీలు ఉన్నారన్నారు. డిప్యూటీ మేయర్ ఎస్సీలకు ఇవ్వాలని కోరితే ఇవ్వకుండా ఆయన కుమార్తెకు ఇచ్చారన్నారు. కార్పొరేషన్ల లో ఎస్సీలకు ,ఎస్టీలకు ఏ పదవి ఇవ్వలేదన్నారు. ఇంతకంటే నియంత పాలన ఏముందన్నారు. వైసిపి పార్టీ రోజు రోజుకు దిగజారుతోంద‌ని ఆరోపించారు. నియంతను నియంత్రించలేని పరిస్థితిలో అధినాయకత్వం ఉందన్నారు. ఎమ్మెల్యే బాధను భ‌రించలేక పరువు కోసం చాలామంది కార్పొరేటర్లు పార్టీని బయటకు వచ్చేందుకు మాకు టచ్ లో ఉన్నారన్నారు. ఎమ్మెల్యే అరాచాకాలను అరికట్టేందుకు పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుందన్నారు. అశోక్ గజపతిరాజు ఆనాడు విజయనగరం లాగా ఉండాలా, విజయవాడలా ఉండాలని అన్నారు. నేడు అదే విధంగా హత్యలు ,మర్దర్లు, భూ ఆక్రమణలు జరుగుతున్నాయన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న జ్యూట్ పరిశ్రమలను మూసి వేయించి రియల్ ఎస్టేట్ చేస్తున్న వ్యక్తి ఎమ్మెల్యే కోలగట్ల అన్నారు. చివరకు కుటుంబాలలో సైతం తగువులు పెట్టే పరిస్థితిలో ఎమ్మెల్యే ఉన్నారన్నారు. మాన్సాస్ వ్యవహారంలో ఆనంద్ గ‌జపతి రాజు కుమార్తెను దించి తగువులు పెట్టించార‌ని ఆరోపించారు. మంత్రి మాన్సాస్ వ్యవహారంలో దూరొద్ధని ఆనాడు చెప్పడం జరిగిందన్నారు. విజయనగరం పట్టణానికి పట్టిన పీడను వదిలించుకోవడానికి రాజీనామ లు చేయడం జరిగిందన్నారు. విలేకర్ల సమావేశంలో మాజీ కౌన్సిలర్ గాడు అప్పారావు అనుచరులు ఉన్నారు. (Story: వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!)

See Also: 

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

రెస్పాన్స్ బ‌ట్టి డెవిల్‌కు సీక్వెల్!

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1