ప్రతీ ఒక్కరూ ఆహార నియమాలు పాటించాలి
డాక్టర్ ఎ.ఎస్.ప్రకాశరావు
విజయనగరం (న్యూస్ తెలుగు) : శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న నడక మైదానంలో శనివారం ఉదయం ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని క్లబ్ అధ్యక్షుడు తాడ్డి ఆదినారాయణ నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ గౌరవ అధ్యక్షులు, ప్రముఖ సంఘసేవకులు డాక్టర్ ఎ.ఎస్.ప్రకాశరావు మాష్టారు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ చక్కని ఆహార నియమాలు పాటించాలని, పండ్లు, ఆకుకూరలు, ప్రోటీన్, పీచు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలని, షుగర్ ను, బరువును అదుపులో నియంత్రించుకోవాలని సూచిస్తూ.. ప్రతీ రోజు నడక, వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలని అన్నారు.
అనంతరం సభ్యులందరూ బరువు పరికరంతో బరువు పరీక్షలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ గౌరవ సలహాదారులు ఆరికతోట తిరుపతి రావు, ఉపాధ్యక్షుడు వల్లూరి శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ వై.నలమహారాజు, క్లబ్ కోశాధికారి ఆర్.సి.హెచ్. అప్పల నాయుడు, క్లబ్ సీనియర్ సభ్యులు కోట్ల సత్యనారాయణ, పైడయ్య, త్యాడ రామకృష్ణారావు(బాలు) తదితరులు పాల్గొన్నారు. (Story: ప్రతీ ఒక్కరూ ఆహార నియమాలు పాటించాలి)
See Also:
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!
‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2