చాకలి ఐలమ్మకు నివాళులు అర్పించిన మాజీ మంత్రి
న్యూస్తెలుగు/వనపర్తి : తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమికోసం,భుక్తికోసం,వెట్టిచాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిదాయకం అని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడారు. నివాళులు అర్పించిన వారిలో గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ పలుస రమేష్ గౌడ్ నందిమల్ల అశోక్,గంధం పరంజ్యోతి,మాజీ కౌన్సిలర్స్ బండారు కృష్ణ, ప్రేమ్ నాథ్ రెడ్డి, స్టార్ రహీమ్, సూర్యవంశం గిరి, జోహెబ్ హుస్సేన్, హేమంత్ ముదిరాజ్, చిట్యాల రాము, వజ్రాల రమేష్, సాయిలీలా, కవిత, ఆటో యూనియన్ నాయకులు తదితరులు ఉన్నారు. (Story:చాకలి ఐలమ్మకు నివాళులు అర్పించిన మాజీ మంత్రి)

