వైభవంగా మహా సామ్రాజ్య పట్టాభిషేకం
విజయనగరం (న్యూస్‌తెలుగు): రింగ్ రోడ్ లోని శ్రీ శ్రీ శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మహా సామ్రాజ్య పట్టాభిషేకం లో భాగంగా బుధవారం ఉదయం రామాయణ పారాయణ. నక్షత్ర హోమం వైభవ ఇష్టి అనే కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగాయి. మధ్యాహ్నం జయ మంత్ర భజన, సాయంత్రం శ్రీరామ కల్యాణం జరిగాయి. అనంతరం శ్రీమాన్ స్థలసాయి స్వామి వారు భద్రాచలం వారు రామాయణం లోని యోధ్యకాండ లో విశేషాలను కడురమ్యంగా అనుగ్రహ భాషణం చేసారు. శ్రీనివాస సేవా సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు. పిళ్ళా విజయ కుమార్, కార్యదర్శి చెరుకూరి శ్రీధర్, సభ్యుల సమక్షంలోఈ కార్యక్రమాలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. (story: వైభవంగా మహా సామ్రాజ్య పట్టాభిషేకం)
See Also:
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!
‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2