ఓటర్ లిస్ట్ సరి చూసుకోండి
న్యూస్ తెలుగు/వనపర్తి : నూతనంగా రూపొందించి గ్రామపంచాయతీలలో నేడు ప్రదర్శించిన ఓటర్ లిస్టులో ఏవైనా పొరపాట్లు ఉంటే చూసి వెంటనే సరి చేసుకోవాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి సూచించారు పేరులో ఏమైనా పొరపాటున ఇంటి పేరులో ఏమైనా పొరపాటునఆధార్ కార్డులో ఏదైనా పొరపాటు ఉన్న ఇంటి అడ్రస్ లో ఏదైనా పొరపాటు ఉన్నా స్థానికంగా ఉండే “బూత్ లెవెల్ అధికారి (BLO)” సంప్రదించి సరి చేసుకోగలరు అలాగే ఓటు హక్కు కలిగి ఉండి ఓటర్ లిస్టులో పేరు కనబడకపోయినా గ్రామము పేరు తప్పు పడిన ఒక ఒకే కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యుల పేర్లు వేరే వేరే వార్డులలో నమోదైన సవరించుకోవడానికిగ్రామ పంచాయతీ కార్యదర్శులు సంప్రదించగలరు కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేవారు మీ సేవలో అప్లై చేసుకొని సంబంధిత మండల MRO కు ఇవ్వగలరు మండలాలలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఈ ఓటర్ లిస్ట్ పై దృష్టి సారించి తప్పు ఒప్పులను వెంటనే సవరించుకోగలరు.(Story : ఓటర్ లిస్ట్ సరి చూసుకోండి )

