ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన యస్ ఐ
న్యూస్ తెలుగు/ చింతూరు : దేశ, రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల కృత్రిమ కొరత సృష్టించటం, ఎక్కువ రేట్లకు అమ్మటం, నిరోధక చర్యలలో భాగంగా చింతూరులో మంగళవారం ఎస్సై రమేష్, హార్డ్డి కల్చర్ ఆఫీసర్ ముత్తయ్య, ఎర్రం పేట లోని మన గ్రోమోర్ ఫెర్టిలైజర్, షాపును మరో ప్రైవేట్ షాప్ ను తనిఖీ నిర్వహించారు. ఆయా షాపుల్లో డి ఎ పి, యూరియా నిల్వలు లేవని నిర్ధారించారు. ఈ మేరకు ప్రభుత్వ ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నట్లు ఎస్సై తెలిపారు.(Story : ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన యస్ ఐ )

