Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఐదేళ్లు భూ ధందాల్లో కనిపిస్తున్న బొల్లా

ఐదేళ్లు భూ ధందాల్లో కనిపిస్తున్న బొల్లా

ఐదేళ్లు భూ ధందాల్లో కనిపిస్తున్న బొల్లా

– అధికారాన్ని అడ్డం పెట్టుకొని అరాచకం చేసిన బొల్లా

– గొడవలు సృష్టించి టిడిపి నేతలపై బురద చల్లితే సహించేది లేదు

– వినుకొండ కూటమి నాయకుల హెచ్చరిక

న్యూస్ తెలుగు/వినుకొండ  : అభివృద్ధిలో బొల్లా బ్రహ్మనాయుడు కనిపిస్తున్నాడని వైసీపీ నాయకుడు, లాయర్ ఎం.న్. ప్రసాద్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని, అభివృద్ధిలో కాదు ఐదేళ్ల వైసిపి పాలనలో వినకొండ లో జరిగిన భూ దందాలు, మోసాలు, అక్రమ కేసులు బనాయింపు, అరాచకాలలో బొల్లా బ్రహ్మనాయుడు కనిపించాడని వినుకొండ కూటమి నాయకులు లాయర్ సైదారావు, ని శంకర శ్రీనివాసరావు, చికెన్ బాబు, యార్లగడ్డ లెనిన్ కుమార్, లాయర్ సిద్దయ్య, భీమని శ్రీను లు విమర్శించారు. టిడిపి కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎంఎన్ ప్రసాదు కూటమి ప్రభుత్వంపై, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, జి డి సి సి బి చైర్మన్ మక్కెన మల్లికార్జున రావులపై చేసిన విమర్శలను వారు తీవ్రంగా ఖండించారు. ఐదేళ్లు వైసిపి పాలనలో బ్రహ్మనాయుడు వినుకొండలో అరాచక పాలన సాగించి ఇస్తానుసారంగా దోచుకున్నారని అన్నారు. భూ దందాలు, ఆక్రమణలు, బెదిరింపులు, రౌడీయిజం, దౌర్జన్యాలు చేయడంలో బ్రహ్మనాయుడు కనపడుతున్నాడని అన్నారు. బీసీ నర్సింహారెడ్డి భూమిని కారుచౌకగా కాజేసిన దాంట్లో బ్రహ్మనాయుడు కనపడుతున్నాడని, నరగాయకుంట ఆక్రమణ యత్నంలో, జాలలపాలెం వద్ద ఆయన భూమిని ప్రభుత్వానికి అమ్మి కోట్లు కాజేసిన కుంభకోణంలో, విటంరాజు పల్లి నుండి, కారంపూడి రోడ్డులో దళితుల భూముల కబ్జాలో బ్రహ్మనాయుడు కనబడుతున్నాడని స్పష్టం చేశారు. డాక్టర్ ఎలమందరావు, జివీ ఆంజనేయులు, మక్కెన మల్లికార్జునరావు హయాంలో జరిగిన అభివృద్ధి ప్రజలకు నేటికీ కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది అన్నారు. ఇష్టానుసారంగా ఐదేళ్లు ప్రజలను దోచుకున్న మీరు అభివృద్ధి గురించి మాట్లాడ్డం హాస్యాస్పదమన్నాడు. ఎంతోమంది అమాయకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించి జీవితాలను నాశనం చేసిన దుర్మార్గుడు బొల్లా బ్రహ్మనాయుడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రషీద్ హత్యకి ముమ్మాటికీ బ్రహ్మనాయుడు కారణమని స్పష్టం చేశారు. టి. అన్నవరం గ్రామంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణను బ్రహ్మనాయుడు, కొందరు వైసీపీ నాయకులు రాజకీయ స్వార్థం కోసం కూటమి నాయకుల పై బురద చల్లడం దుర్మార్గమన్నారు. బ్రహ్మనాయుడు తన రాజకీయ స్వార్థానికి ఎంతోమంది యువకుల జీవితాలను నాశనం చేశాడని, ముఖ్యంగా వినుకొండ పట్టణంలో కొందరు ముస్లిం యువకులను గంజాయి కి బానిసలుగా చేసి తన స్వార్థానికి ఉపయోగించుకున్నాడని అన్నారు. లాయర్ కు ఎక్కువ, గుమస్తాకు తక్కువ అయిన ఎం. ఎన్. ప్రసాద్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని, కూటమినేతలపై విమర్శించే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. రాజకీయ స్వార్థం కోసం మీలో మీరే గొడవలు, ఘర్షణలు, అల్లర్లు సృష్టించి కూటమి నేతలపై విష ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో న్యాయవాదులు నల్లబోతుల రామకోటేశ్వరరావు, ఎలవర్తి శ్రీనివాసరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.(Story : ఐదేళ్లు భూ ధందాల్లో కనిపిస్తున్న బొల్లా )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments