విద్యార్థులకు అస్వస్థత.. కారణమదే!
న్యూస్‌తెలుగు/అన్నవరం: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనస గ్రామంలో ఉన్న బి.సి మగురుకుల పాఠశాలలో ఏడుగురు విద్యార్థులు బయట నుండి తీసుకువచ్చిన ఆహారం రెండు రోజులు దాచుకుని తినడం వల్ల వాంతులు, విరోచనాలు అవ్వడంతో అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులను స్థానిక ఎ ఎన్ ఎమ్ కు చూపించిన తర్వాత అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా శాసన మండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయిల్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు డా.పినిపే శ్రీకాంత్ లు ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న విద్యార్థులను పరామర్శించి, సంఘటనపై విద్యార్థులను, పాఠశాల ప్రిన్సిపాల్, తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు.
ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో జరిగిన విద్యార్థుల అస్వస్థత గురువ్వడం చాలా బాధాకరమని అన్నారు. గురుకుల పాఠశాలను పరిశీలించి అనంతరం జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా చర్చించి, సంఘటనపై విచారణ చేసి నివేదికను కోరడం జరుగుతుందన్నారు. విద్యార్థుల ఆరోగ్య విషయంపై వైద్యాధికారులు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నికడగా ఉందని వైద్యులు తెలిపారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎటువంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. (Story: విద్యార్థులకు అస్వస్థత.. కారణమదే!)