Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి

స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి

స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి

న్యూస్ తెలుగు/సాలూరు :  స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి ప్రజలపై విద్యుత్ బారాలు ఆపాలని కోరుతూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సాలూరు విద్యుత్ సభ స్టేషన్ అధికారులకు వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షులు గేమ్మెల జానకిరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలో కి రాకముందు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి స్మార్ట్ మీటర్లు పెట్టించాలని ప్రయత్నాలు మొదలు పెట్టిందని తెలిపారు. స్మార్ట్ మీటర్ల వలన ప్రజలపై విపరీతమైన భారం పడి ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని కావున రాష్ట్ర ప్రభుత్వం ఆదాని స్మార్ట్ మీటర్లు ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు.స్మార్ట్ మీటర్లు పెట్టుకోవాలని ప్రజల పైన అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ సంస్థలకు స్మార్ట్ మీటర్లు బిగించారని తెలిపారు. స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ప్రజలపై భారాలు వేయద్దని కోరారు. ప్రజలపై ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో విపరీతమైన భారాలు వేస్తున్నారని రో ఆఫ్ చార్జీల భారాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు ఎస్ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. (Story:స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments