ఇద్దనవలసలో బాబు ష్యూరిటీ..అబద్ధాలు గ్యారెంటీ కార్యక్రమం
న్యూస్ తెలుగు /సాలూరు : కూటమీ ప్రభుత్వంలో నాయకులు ప్రజా సంక్షేమం దాచుకోవడం దోచుకోవడం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ గిరిజన శాఖ మాత్యులు వైయస్సార్ పార్టీ పొలిటికల్ అడ్వజర్ కమిటీ సభ్యులు పిడికి రాజన్న దొర అన్నారు. సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం ఇద్దనవలసలో బాబు ష్యూరిటీ..అబద్ధాలు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంటింటికి వంచన,బాబు ష్యూరిటీ..అబద్ధాలు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు చేసిన మోసాలను, పథకాలు,హామీలు ఇవ్వడంలో చేసిన మోసాలను వివరించిన కార్యక్రమంలో మెంటాడ మండలం వైసీపీ ప్రజాప్రతినిధులు,వివిధ అనుబంధ విభాగాల సభ్యులు,వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.. (Story:ఇద్దనవలసలో బాబు ష్యూరిటీ..అబద్ధాలు గ్యారెంటీ కార్యక్రమం)

