బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ‘బాబు షూరిటీ మోసం గ్యారంటి’ కార్యక్రమం
న్యూస్ తెలుగు / వినుకొండ :
బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నియోజకవర్గ విస్తృత స్థాయి స్థాయి సమావేశంలో పాల్గొన్న జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ పార్లమెంటు సభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, పార్లమెంట్ పరిశీలకులు పూనరి గౌతమ్ రెడ్డి, గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ. వినుకొండ నియోజకవర్గం అభివృద్ధి చెందింది అంటే కేవలం బ్రహ్మనాయుడు వలనే అని, వినుకొండ అభివృద్ధి అంటే బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా బ్రహ్మనాయుడు అంటే వినుకొండ అభివృద్ధి అని, అంతేకాదు ఒకసారి బ్రహ్మనాయుడు సొంత గ్రామాన్ని చూద్దాం, జీవి ఆంజనేయులు సొంత గ్రామాన్ని చూద్దాం, ఏ గ్రామం ఎక్కువ అభివృద్ధి చెందిందో ఎవరు ఎక్కువ అభివృద్ధి చేశారు అనేది కూడా మనం ఎప్పుడు చూసినా అర్థం అయిపోతుంది అని, ఆంజనేయులు సొంత గ్రామానికి కూడా రోడ్డు వేయించింది బొల్లా బ్రహ్మనాయుడు అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ. కార్యకర్తలు ఎవరు భయపడవద్దు అని మీ కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా భరించి రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 2.0 చూపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు,మహిళలు పాల్గొన్నారు. (Story:బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ‘బాబు షూరిటీ మోసం గ్యారంటి’ కార్యక్రమం)

