Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌జడ్పీ హైస్కూల్ లో వ్యాసరచన పోటీలు

జడ్పీ హైస్కూల్ లో వ్యాసరచన పోటీలు

జడ్పీ హైస్కూల్ లో వ్యాసరచన పోటీలు

న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక జడ్పీ హైస్కూల్, ఎన్.ఎస్.పి కాలనీ నందు నియోజకవర్గ స్థాయిలో తల్లికి వందనం కార్యక్రమం సందర్భంగా నియోజకవర్గంలోని మండలాలలో గెలుపొందిన విద్యార్థులకు ఆరు విభాగాలలో వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు, పాటలపోటీలు, డ్రాయింగ్ ,కధలు, నాటిక పోటీలు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించారు. ఈ పోటీలకు నూజెండ్ల బొల్లాపల్లి, వినుకొండ, శావల్లపురం, ఈపూరు మండలాల నుండి సుమారు 120 మంది బాలబాలికలు పాల్గొని చక్కగా ప్రదర్శనలు చేశారని పాఠశాల హెచ్ఎం సిహెచ్ వీరప్పయ్య తెలిపారు. గెలుపొందిన మరియు జిల్లా పోటీలకు ఎంపికైన వారు బి.సుధారాణి అంబేద్కర్ గురుకుల పాఠశాల, ఉప్పలపాడు నూజెండ్ల మండలం. వక్తృత్వ పోటీలు
ఆర్ యజ్ఞశ్రీ జడ్పి హెచ్ ఎస్ బొగ్గరం, ఈపూరు మండలం. పాటల పోటీలు వై. శ్రీ హేమలత జడ్పి హెచ్ ఎస్ వేల్పూరు శావల్యపురం మండలం. డ్రాయింగ్ పోటీలు ఎస్కే.మస్తాన్ బి జడ్.పి.హెచ్.ఎస్ గర్ల్స్ వినుకొండ, వినుకొండ మండలం. కథలను చెప్పడం సిహెచ్ లక్ష్మయ్య జడ్పి హెచ్ ఎస్ ఇనుమెళ్ళ, ఈపూరు మండలం. నాటిక పోటీలు జడ్.పి.హెచ్.ఎస్ వేల్పూరు, శావల్యపురం మండలం. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి ఎస్ డి జఫ్రుల్లా, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి హెచ్ వీరప్పయ్య, ఎన్ పద్మజ, రాంబాబు, రాణి, శ్రీనివాసరావు, ఎం వెంకటేశ్వర్లు , చంద్రశేఖరం, చిన్న మల్లయ్య, గోవింద్ నాయక్, శాంతకుమారి, కోటి రత్నం, గాయత్రి, సంధ్య తదితరులు పాల్గొన్నారు. (Story:జడ్పీ హైస్కూల్ లో వ్యాసరచన పోటీలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments