బుచ్చయ్య చౌదరి నీ అనుభవం ఇదేనా..?
న్యూస్ తెలుగు /సాలూరు :బుచ్చయ్య చౌదరి నీ రాజకీయ అనుభవం ఇదేనా.. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తల ఎందుకు నరకకూడదు అనడం ఎంతవరకు సమంజసం అని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ గిరిజన శాఖ మాత్యులు వైయస్సార్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు పీడిక రాజన్న దొర అన్నారు. సోమవారం ఆయన స్వగృహంలో విలేకరుల తో మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి తల ఎందుకు నరకకూడదు అనడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. నీవు ఈ వయసులో పెద్దవాడివై ఉండి ఇలాంటి మాటలు అనడం నీ అహంకారానికి నిదర్శనమన్నారు. రాజకీయాలు అన్నివేళలా ఒకేలా ఉండవని ఈరోజు అధికారంలో ఉండొచ్చు లేకపోవచ్చు రాజకీయాల్లో ఉండేటప్పుడు హుందాతనం గా మాట్లాడాలని అన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడును గాని, లోకేశ్ నుగాని, పవన్ కళ్యాణ్ గాని ఇలాంటి చౌకబారు మాటలు ఇప్పుడైనా మాట్లాడమా అని అన్నారు. ఏదో చంద్రబాబు నాయుడు మెప్పు కోసం నీకు మంత్రి పదవి ఇస్తారనే ఆశతో ఇలాంటి మాటలు ఆడుతున్నావని అర్థం అయింది లే అని అన్నారు. నీకు మంత్రి పదవి చంద్రబాబునాయుడు ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. అదే విధంగానే మక్కువ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుల్ల వేణు గోపాల్ నాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని దీనిపై మా గిరిజన నాయకులు అందరూ తీవ్రంగా ఖండించారని అన్నారు. వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారని. ఇప్పటివరకు ఆయన క్షమాపణ చెప్పలేదని అన్నారు. దీనిపై త్వరలోనే పోలీస్ స్టేషవ్ లో ఫిర్యాదు చేస్తానని అన్నారు. జర్నలిస్ట్ కృష్ణంరాజు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సాలూరులో కేసు నమోదు అయిందని అలాంటప్పుడు వేణు నాపై మహానాడులోని, ఏఎంసీ ప్రమాణ స్వీకారం లోని, మక్కువ లోని కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి నాపై అసభ్యకరంగా మాట్లాడడని వీరిపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదొ పోలీసులు చెప్పాలని అన్నారు. (Story:బుచ్చయ్య చౌదరి నీ అనుభవం ఇదేనా..?)

