మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుల పదోన్నతిలో ఎస్ జి టీ లకు తీవ్ర అన్యాయం. ఏ పి టి ఫ్
న్యూస్ తెలుగు/సాలూరు : సాలూరు లో ఏ పి టీ ఫ్ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఉమ్మడి విజయనగరం జిల్లా గౌరవ అధ్యక్షుడు జోగినాయుడు మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ ఇటీవల జరిపిన బదిలీలు పదోన్నతుల్లో ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని తెలిపారు.పాఠశాలల రిజిస్ట్రక్చరింగ్ లో ఫౌండేషన్ స్కూల్ ల వలన ఆ ఆవాస ప్రాంతంలో 3,4,5 విద్యార్ధులకు అన్యాయం జరిగిందని అన్నారు. పై తరగతులకు వెళ్లాల్సిన విద్యార్థులకు ప్రైవేటు పాఠశాల రవాణా సదుపాయం కల్పించడం వల్ల, ప్రవేట్ పాఠశాలకు తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి చేకూర్చుతుండడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గి ప్రైవేటు పాఠశాలలో చేరే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వం దేశ పూర్వకంగానే విద్యను ప్రైవేటీకరణ చేయడంలో భాగంగా ఇటువంటి విధానాలు అనుసరిస్తుందని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ భావిస్తోందని అన్నారు. ప్రాథమిక విద్యను కాపాడాలంటే అన్ని ఆవాస ప్రాంతాల్లో ఒకటి నుండి ఐదు తరగతులు తప్పనిసరిగా ప్రభుత్వం కొనసాగించాలిని అన్నారు. సర్వీస్ రూల్స్ ని అనుసరించి మోడల్ ప్రైమరీ పాఠశాలలో ఎస్జీటీలకు మోడల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి కల్పించాల్సిన ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో తెలుగు మీడియం లేకుండా చేసి ఉపాధ్యాయులను మిగులుగా చూపించి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులని మోడల్ ప్రైమరీ ప్రధానోపాధ్యాయులుగా నియమించడంతో ఎస్ జి టి లకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. ప్రభుత్వం దీనిని సరి చేయాలని కోరుతున్నామని అన్నారు. ఈ సమావేశంలో సాలూరు, పాచిపెంట ఏ పి టి ఫ్ బాధ్యులు ధనలక్ష్మి, , ఏ పి టి ఫ్ పక్షాన పార్వతీపురం మరియు విజయనగరం జిల్లాల గౌరవ అధ్యక్షలు బంకురు జోగినాయుడు, ఏ పి టి ఫ్
పార్వతీపురం మన్యం జిల్లా నాయకులు ఆర్నిపల్లి తిరుపతిరావు పాల్గొన్నారు.(Story : మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుల పదోన్నతిలో ఎస్ జి టీ లకు తీవ్ర అన్యాయం. ఏ పి టి ఫ్ )

