సరిహద్దు గ్రామాల సమస్యలను పరిష్కారించాలి
న్యూస్ తెలుగు /సాలూరు : కొట్టియా సరిహద్దు గ్రామాల సమస్యను పరిష్కారం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఎగువ శెంబి గ్రామం లో పాదయాత్ర ప్రజా సంఘాల నాయకులు ప్రారంభించారు ఎగువ కోటియా దిగువ కోటియా ముడకారు బర్నపాడు పగులు చిన్నారి పట్టుచన్నారు గ్రామాల మీదిగా పాదయాత్ర కొనసాగుతుంది ఆదివాసి గిరిజన సంఘం మండల కార్యదర్శి గేమ్మెల జానకిరావు మాట్లాడుతూ దశాబ్దాలు కాలంగా కొట్టా సరిహద్దు వివాదం పరిష్కారం కాక రెండు రాష్ట్రాల మధ్యన గిరిజనులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఒడిస్య ప్రభుత్వం ఈ మధ్యకాలంలో దూకుడు పెంచి గిరిజనులపై దాడులకు దిగుతోందని దాడులను అడ్డుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని గిరిజనులకు రక్షణ కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తుందని తెలిపారు ఈ ప్రాంతమంతా షెడ్యూల్ ఏరియా గా ఉందని ఇక్కడ సర్వాకులు సర్వహక్కులు స్థానిక గిరిజనులవేయని తెలిపారు అయినా ఇవేమీ పట్టకుండా గిరిజనుల భూములను లాక్కోవడానికి ఒడిస్సా ప్రభుత్వం ప్రయత్నం చేయడం జరిగిందని తెలిపారు ఎప్పటికైనా ఇరువురు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు ప్రజా సంఘాల నాయకులు ny నాయుడు కోరాడ ఈశ్వరరావు మర్రి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడటం జరిగింది కొట్టియా సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని గిరిజనులను రాజకీయ ఓటు బ్యాంకు మాత్రమే చూస్తుందని తెలిపారు ఈ వైఖరి మారాలని ఈ ప్రాంత అభివృద్ధికి రెండు రాష్ట్రాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చొరవ చేసి రెండు రాష్ట్ర ప్రభుత్వాలను చర్చలకు సిద్ధం చేసి సమస్య పరిష్కారం చూపాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల కమిటీ నాయకులు తాడంగి సన్నము కొమ్ములు బీమా రంజిత్ సీతయ్య తదితరులు పాల్గొన్నారు. (Story:సరిహద్దు గ్రామాల సమస్యలను పరిష్కారించాలి)

