వినుకొండ పురపాలక సంఘం పరిధిలో ఘనంగా నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా డే వేడుకలు
న్యూస్ తెలుగు/వినుకొండ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్ని శనివారం వినుకొండ పురపాలక సంఘంలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో మునిసిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తహశీల్దార్ సురేష్ నాయక్ మరియు మునిసిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు లింగరాజు సుమారు 1000 మంది యోగ ఔత్సాహికులతో పలు ఆసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, యోగా ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుందని అన్నారు. ప్రభుత్వ నిర్దేశానుశారం పట్టణంలో నెల రోజులు పాటు యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించినట్టు దీన్ని జయప్రదం చేసేందుకు సహకరించిన ప్రజాప్రతినిధులకు యోగ శిక్షకులకు అధికారులకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ షకీలా దస్తగిరి, కూటమి నాయకులు షమీంఖాన్, ఆర్ఎస్ఎస్ సభ్యులు, ఎన్స్పీ యోగ సభ్యులు, జూనియర్ కాలేజ్ గ్రౌండ్ యోగ సభ్యులు,వాసవి వనిత క్లబ్ సభ్యులు,బాలాజీ యోగ సభ్యులు,గీతాంజలి స్కూల్ విద్యార్థులు,బాల గుడి స్వచ్ఛంద సంస్థ సభ్యులు బాల గురు పచ్చని సంస్థ సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.(Story : వినుకొండ పురపాలక సంఘం పరిధిలో ఘనంగా నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా డే వేడుకలు )