వినుకొండకు పశు వైద్యులుగా వచ్చిన శ్రీరాములుకు ఆర్టీసీ ఉద్యోగులు ఘన సన్మానం
న్యూస్ తెలుగు / వినుకొండ : పట్టణంలోని పశు వైద్యశాలకు నూతనంగా బదిలీపై వచ్చిన డాక్టర్ నేలపల్లి శ్రీరాములు ను ఏపీ పిటిడి ఎంప్లాయిస్ యూనియన్ పల్నాడు జిల్లా అధ్యక్షులు ఎస్కే. ఖాజా ఆధ్వర్యంలో బుధవారం ఆర్టీసీ ఉద్యోగులు కలసి దుశ్యాలువా,పూల మాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఖాజా మాట్లాడుతూ. పశువైద్యాధికారి డాక్టర్ శ్రీరాములు వినుకొండలో బంధుత్వం కలిగి ఉండి, ఆర్టీసీ ఉద్యోగులతో కార్మిక వర్గంతో ఎంతో కలిసిమెలిసి ఉండేవారని, అలాగే అన్ని వర్గాలలో మంచి పేరు సంపాదించుకుంటూ ముందుకు పోయే వారన్నారు. నేటి వరకు ఆయన వివిధ ప్రాంతాలలో పశువైద్యాధికారిగా పని చేసి ఎప్పటికప్పుడు పాడి రైతులకు అందుబాటులో ఉంటూ, పశువులకు వైద్య సేవలు అందిస్తూ పశు నష్టం జరగకుండా వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. అలాగే వినుకొండ ప్రాంతంలో కూడా ఎప్పటికప్పుడు రైతులకు అందుబాటులో ఉంటూ పశు మరణాలు జరగకుండా వైద్య సేవలు అందిస్తూ ముందుకు సాగాలని ఖాజా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కే హరిబాబు, వి. శ్రీనివాసరావు, ఎం.పాపయ్య, పి. మధుబాబు, బుల్లెయ్య తదితరులు పాల్గొన్నారు. (Story:వినుకొండకు పశు వైద్యులుగా వచ్చిన శ్రీరాములుకు ఆర్టీసీ ఉద్యోగులు ఘన సన్మానం )

