పట్టాదారు మార్పిడి, పోలవరం ముంపు సమస్య పరిష్కరించాలని ఐటిడిఏ పీఓ కి వినతి
న్యూస్ తెలుగు/ చింతూరు : పట్టాదారు మార్పిడి, పోలవరం ముంపు సమస్య పరిష్కరించాలని ఐటిడిఏ పీఓ కి సీపీఐ ఆధ్వర్యంలో వినతి అందించారు. బుదవారం సీపీఐ ఆధ్వర్యంలో చింతూరు బంక్ దగ్గర నుండి ర్యాలీ గా వెళ్లి ఐటిడిఏ ఎదురుగా ధర్నా చేపట్టి అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఐటిడిఏ పీవో అపూర్వ భరత్ కి అందించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కందుకూరి స్వర్ణ మాట్లడుతూ భూ పట్టా పాస్ బుక్ మార్పిడి చేపట్టాలని, తల్లిదండ్రులు పేరు మీద ఉన్న పాస్ బుక్ లు కుటుంబ వారసుల మీద పట్టా పాస్ బుక్ లు మార్చాలని, మార్పిడి జరగని ఎడల పట్టా దారు మరణిస్తే రైతు భరోసా లాంటి పథకాలు నామినికి అందించాలన్నారు. వారికి అన్నదాత సుఖీభవ పధకానికి అర్హులుగా గుర్తించాలన్నారు.
ఎటపాక మండలంలోని గన్నవరం, కృష్ణవరం గ్రామాలను పోలవరం ముంపులో చేర్చి, పరిహారం, పునరవాసం కల్పించాలన్నారు. గోదావరీ వరదల సమయంలో మరుమూరు గ్రామం నుండి గుండాల గ్రామం వరకు వరదలతో రోడ్డు బ్లాక్ అయ్యి వరద ముంపులో ఉన్నవారికి 3 నెలలకు సరిపడ సరుకులు ఇచ్చి పదివేల రూపాయలు అందించాలన్నారు. 50 సంత్సరాలు నిండిన వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, స్పౌస్ పెన్షన్లు అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో
సీపీఐ మండల కార్యదర్శి ఎలీషాల నాగరాజు , పద్దం సత్తెమ్మ , సున్నం శ్రీను,పొలమంచి సత్యం, చిచ్చడీ శ్రీను, దానే ముత్తమ్మ, పడ్డం సీతమ్మ, నానీనమ్మ, తదితరులు పాల్గొన్నారు. (Story:పట్టాదారు మార్పిడి, పోలవరం ముంపు సమస్య పరిష్కరించాలని ఐటిడిఏ పీఓ కి వినతి)

