పంటకు గిట్టుబాటుధర వచ్చే విధంగా చట్టం చేస్తానని రైతులను మోసం చేసిన బిజెపి
అమరావతిని ఢిల్లీని తలదన్నే రాజధానిని చేస్తానని రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసగించిన బిజెపి
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడానికి పావులు కదుపుతున్న బిజెపి
దేశాన్ని 200 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి నెట్టిన బిజెపి
తిరుమలేశుని సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని రాష్ట్ర ప్రజలను మోసం చేసిన బిజెపి
న్యూస్ తెలుగు / వినుకొండ : భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికలప్పుడు దేశంలో అధికారంలోకి వస్తే వంద రోజుల్లో సామాన్యుడు వాడుకునే నిత్యవసర సరుకులు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ధరలు మూడు రెట్లు పెంచారని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. బుధవారం నాడు మండల కేంద్రమైన వినుకొండ నియోజకవర్గం నాగిరెడ్డిపల్లి లో జరిగిన మండల మహాసభకు కామ్రేడ్ మరియు బాబు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొనిన ఆయన మాట్లాడుతూ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రజా రంజక పాలన అందిస్తామని ఎన్నికలలో వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో వైఫల్యం చెందాయని ఆయన అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన బిజెపి ఇప్పటికి మూడవసారి అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అధికారం వెలగబెట్టి ఈ దేశానికి సాధించి పెట్టింది ఏమీ లేదని 200 లక్షల కోట్ల రూపాయలు అప్పులు మాత్రం చేసి అప్పుల భారత దేశంగా మిగిలింది అన్నారు. దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్నకు రుణాలు రద్దు చేయమంటే చేయలేరు కానీ లక్షల కోట్ల లాభాలు ధనం ఆర్జిస్తున్నటువంటి అంబానీ అదాని లాంటి కార్పొరేట్ శక్తులకు మరొక 28 మంది కార్పొరేట్ దిగ్గజాలకు గత 11 సంవత్సరాల బిజెపి పాలన లో 16 లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు ఇది పార్లమెంటు సాక్షిగా అన్ని రాజకీయ పార్టీలకు తెలిసిన నగ్న సత్యం అని ఆయన మహాసభలో తెలిపారు. పార్లమెంటు సభ్యులకు వేతనాలు పెంచుకొనుటకు పార్లమెంట్ వేదికగా ఒక పార్లమెంట్ సభ్యునకు రెండున్నర లక్షల రూపాయలు వేతనాలు పెంచుకున్నారని, శాసనసభ్యులు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు శాసనసభ, శాసనమండలి సాక్షిగా నెలకు రెండున్నర లక్షల రూపాయలు వేతనాలు పెంచుకున్నారని దేశానికి పట్టెడ అన్నం పెట్టే రైతన్నకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడానికి వారికి చేతులు రాలేదని ఆయన దుయ్యబట్టారు. రైతాంగం సంవత్సరం పాటు జరిపిన మహత్తర పోరాటాల ఫలితంగా రైతు సంఘాలకు ప్రధానమంత్రి కి వ్యవసాయ మంత్రికి మధ్యలో జరిగిన చర్చలలో వ్రాతపూర్వకంగా ప్రధానమంత్రి గారు ఇచ్చిన హామీలు నీటి మూటలు అయ్యాయని ఆయన విమర్శించారు ఇంతవరకు దేశంలో ఎందరో ప్రధానులు ఆ పదవి నాలంకరించినప్పటికీని ప్రజలకు ఇచ్చిన మాటను అందులో రైతులకు ఇచ్చిన మాటను పక్కన పెట్టుటలో మోడీ గారు నంబర్ వన్ ప్రధానిగా మిగిలిపోయారని మరలా రైతాంగాన్ని రోడ్లపై పోరాటాలకు దించిన చరిత్ర ఆయనదని విమర్శించారు. కార్మికులు దశాబ్దాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్ లు గా విభజించి చట్టాల ను నీరుగార్చిన చరిత్ర నరేంద్ర మోడీ గారిదని ఈ అడ్డగోలు చట్టాలను అడ్డం పెట్టుకొని నేడు దేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్ర రాష్ట్రం తో సహా కార్మికులపై రోజుకు10 గంటల పెంచుతున్నారని కార్మికుల శ్రమ దోపిడీ కోసం నిరంకుశ పోకడలు పోతున్నారని ఆయన విమర్శించారు. దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఇప్పటికే ఈ దుర్మార్గ చట్టాలపై జూలై 9న దేశవ్యాప్త సమ్మెను చేయ తలపెట్టాయని 50 కోట్ల మంది సంఘటిత సంఘటిత రంగ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారని కార్మికులు ఉద్యోగులు రైతాంగం ఈ సమ్మెను జయప్రదం చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు సంవత్సరం అయినప్పటికిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేదని వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, రైతు సంఘం నాయకులు ఉలవలపూడి రాము మాట్లాడుతూ పట్టణాలలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు ఇంటి స్థలము ఇచ్చి ఇల్లు కట్టుకోలేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న నాలుగు లక్షల రూపాయిలు చాలవని ఐదు లక్షల రూపాయలుగా పెంచి ఇవ్వాలని కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కోరుతోందని వారు తెలిపారు. వృద్ధాప్య వితంతు వికలాంగ ఒంటరి మహిళ అర్హులైన వారందరికీ పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని రేషన్ కార్డులు అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇవ్వాలని ఒక్కొక్క ఇంటిలో నాలుగు కుటుంబాలు నివసిస్తున్న నేపథ్యంలో వారందరికీ ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు మంజూరు చేయడంపై ప్రభుత్వం సక్రమమైన ఎంక్వైరీ జరిపి వారికి ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయస్థాయి నుండి మహాసభలు జరుగుతున్నందున వినుకొండ నియోజకవర్గ మహాసభ జూన్ 30న జరుగుతున్నందున మహాసభలో నియోజకవర్గస్థాయి క్యాడర్ కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. మహాసభలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల కమిటీ కార్యదర్శిగా కొప్పరపు మల్లికార్జునరావు, సహాయ కార్యదర్శులుగా ధూపాటి స్కైలాబ్, సిహెచ్ నాగరాజులను మరియు ఏడుగురు కమిటీ సభ్యులతో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. మండలంలోని అనేక ప్రజా మౌలిక సమస్యలపై తీర్మానాలు చేశారు. (Story: పంటకు గిట్టుబాటుధర వచ్చే విధంగా చట్టం చేస్తానని రైతులను మోసం చేసిన బిజెపి)

