అధోగతి నుంచి అభివృద్ధి శిఖరాల వైపుగా ఏడాది ప్రయాణం
సుపరిపాలనకు ఏడాది సందర్భంగా చీఫ్ విప్ జీవీ కార్యాలయంలో సంబరాలు
కూటమి నాయకులు, శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసిన జీవీ ఆంజనేయులు
న్యూస్ తెలుగు / వినుకొండ : గడిచిన ఏడాదిగా రాష్ట్రాన్ని అధోగతి నుంచి అభివృద్ధి శిఖరాల వైపు నడిపించే దిశగానే కూటమి పాలన సాగుతోందని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. సుపరిపాలనలో ఈ ఏడాది తొలి అడుగులు పడ్డాయని, రానున్న నాలుగేళ్లలో రాష్ట్రం ముఖచిత్రమే మార్చడమే సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. అందులో భాగంగానే సంక్షేమం, అభివృద్ధి, వ్యవసా యం, విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందిన్నారు. కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు ఏడాది సందర్భంగా గుంటూరులో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి జీవీ ఆంజనేయులు కేక్ కట్ చేసి, విజయోత్సవం జరుపుకున్నారు. అనంతరం మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ విధ్వంసం నుంచి వికాసం దిశగా ఈ ఏడాది ప్రయాణం రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం నిబద్ధత, అభివృద్ధి పట్ల అంకితభావానికి నిదర్శ నం అన్నారు. 1.2కోట్లమందికి వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్దిని అందించడం చరిత్రాత్మకం గా పేర్కొన్నారు. గత ప్రభుత్వం మిగిల్చిన ఆర్థిక సంక్షోభం, పరిపాలనా అస్తవ్యస్తతలను దాటి ప్రజలకు ఇంతగా ప్రయోజనం అందించడం ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం, సామర్థ్యం, విశ్వసతనీయతల కారణంగానే సాధ్యమైందన్నారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యం సాధనకు ప్రజాస్వామ్య బద్ధంగా పనిచేస్తున్నామని తెలిపారు. రాజధాని అమరావతి, పోలవరం, పోర్టుల నిర్మాణం, రహదారుల అనుసంధానం వంటి ప్రాజెక్టులతో పరిశ్రమలకు బంగారు బాటలు వేస్తున్నామని ఏడాదిలోనే 9న్నర లక్షల కోట్ల వరకు పెట్టుబడులకు కుదిరిన ఒప్పందాలే అందు కు నిదర్శనమని చెప్పారు. ఈ సంబరాలలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీబీ పర్సన్ ఇన్ ఛార్జి మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. (Story:అధోగతి నుంచి అభివృద్ధి శిఖరాల వైపుగా ఏడాది ప్రయాణం)

