Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం రికార్డు

ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం రికార్డు

ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం రికార్డు

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్ నిర్వహించిన జీవీ

న్యూస్ తెలుగు/వినుకొండ  : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదికాలంలో ప్రజా సమస్యల పరిష్కారంలో సరికొత్త రికార్డు సాధించామని ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. రెవెన్యూ సదస్సులు, వారంవారం నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమాలే అందుకు నిదర్శనం అన్నారు. మంత్రి లోకేష్‌ స్ఫూర్తితో ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన ప్రజా దర్బార్ అయితే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఎంతో దూరం తగ్గించిందని హర్షం వ్యక్తం చేశారు . వినుకొండ పట్టణంలో ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌కు చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వినతులు స్వీకరించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తక్షణచర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు తక్షణ స్పందన, సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్‌ను ముందుకు తీసుకుని వెళ్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం పేదలది, ప్రజాప్రతినిధులు ఉన్నది వారి సాధకబాధకాలు వినేందుకు, తీర్చేం దుకు అనే విశ్వాసం కలిగించడంలో ఈ కార్యక్రమం ఎంతో విజయవంతమైందన్నారు. ప్రభుత్వ పథ కాలు సమర్థంగా అందించేందుకు, క్షేత్రస్థాయిలో ప్రజల ఇబ్బందులు నేరుగా తెలుసుకోవడానికి కూడా దీనితో అవకాశం ఏర్పడిందని హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం చీఫ్‌విప్ కార్యాలయం నిర్వహించిన ప్రజా దర్బార్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై సమస్యలు విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానికనాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.(Story : ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం రికార్డు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments