కె.సి.ఆర్ ప్రజా సంక్షేమపరి పాలన
న్యూస్ తెలుగు/ వనపర్తి : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బిఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ శ్రేణులు అమరవీరులకు నివాళులు,తెలంగాణ తల్లికి పూలమాలలు సమర్పించినారు. జాతీయ జెండాను జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్,పార్టీ జెండా పట్టణ అధ్యక్షులు పలుస.రమేష్ గౌడ్ ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభించారు. నాయకులు కార్యకర్తలు అవతరణ దినోత్సవ కేకు కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కె.సి.ఆర్ గారు ఆంధ్రపాలకుల బానిస పాలన నుండి తెలంగాణను విముక్తి చేయుటకు 14ఏండ్ల సుదీర్ఘ ఉద్యమం చేసి శూన్యంలో సునామి సృష్టించి తెలంగాణ రాష్ట్రన్నీ సాధించారని రాష్ట్రన్నీ సాధించడమే కాకుండా ప్రజల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు భరోసా, రైతు రుణ మాఫీ,కె.సి.ఆర్.కిట్టు,ఆసరా పింఛన్లు,కళ్యాణ లక్ష్మి,వంటి సంక్షేమ పథకాలతో పాటు విద్యా వైద్యం,సంక్షేమం కోసం 11వందల గురుకుల పాఠశాలలు,నూతన జిల్లాలతోపాటు కలెక్టరేట్ కార్యాలయాలు,జిల్లాలలో మెడికలు కాలేజీలు సాధించి భారతదేశ చరిత్రలో తెలంగాణను అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపిన ఘనత కె.సి.ఆర్ గారిది అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ పాలన అంతా తిరోగమనంలో కొనసాగుతుందని,సంక్షేమ పథకాలు అన్ని కూడా నిర్వీర్యం అయినాయి అని తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్లాలంటే మళ్ళీ కె.సి.ఆర్ నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు. కె.సి.ఆర్ ని ఆదర్శంగా తీసుకొని గౌరవ నిరంజన్ రెడ్డి గారు నియోజకవర్గాని అన్ని రంగాలలో అభివృద్ధి చేశారని లక్ష ఎకరాలకు సాగునీరు అందించి రైతును రాజుగా చేసిన ఘనత నిరంజన్ రెడ్డికి దక్కుతుందని,దశాబ్దాల కల రోడ్ల విస్తరణ, చెరువుల పునరుద్ధరణ, ఐ.టి టవర్, జె. ఎన్.టి.యు కాలేజ్, అగ్రికల్చర్ కళాశాల,ఫిషరీస్ కళాశాల,మెడికల్ కాలేజ్,మాత శిశు సంరక్షణ కేంద్రం వంటి అనేక అభివృధి పథకాలు సాధించారని నేడు నియోజకవర్గం అభివృద్ధి లేక ఆగం అయిందని విమర్శించారు. ఈ కార్యక్రమములో గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్, పి.రమేష్గౌడ్,నందిమల్ల.అశోక్,గంధం.పరంజ్యోతి,కురుమూర్తి యాదవ్,మండల పార్టీ అధ్యక్షులు వనం.రాములు,వెంకటస్వామి,దిలీప్ రెడ్డి, బొల్లెద్దుల.బాలరాజు, మతీన్, చంద్రశేఖర్,కర్రేస్వామి,రఘుపతి రెడ్డి,మల్లారెడ్డి,రఘువర్ధన్ రెడ్డి, రవిప్రకాష్ రెడ్డి,ధర్మా నాయక్, జాతృ నాయక్,గులాం ఖాదర్ ఖాన్,చిట్యాల.రాము,సూర్యవంశం.గిరి, జోహేబ్ హుస్సేన్,మాజీ కౌన్సిలర్స్,బండారు.కృష్ణ, నాగన్న యాదవ్,ఉంగ్లం. తిరుమల్,కంచె.రవి,ప్రేమ్ నాథ్ రెడ్డి,స్టార్.రహీమ్,సింగిల్ విండోమాజీ అధ్యక్షులు విజయ్ కుమార్,బాను ప్రకాష్ రావు,జగన్నాథం నాయుడు,నాయకులు, ఉస్మాన్,ఎర్ర.శ్రీను,జహంగీర్,ఇమ్రాన్, సయ్యద్.జమీల్,నందిమల్ల.రమేష్ ఫజల్,శ్యాం,పెద్దముక్కుల. రవికుమార్,మోహన్ నాయి,ఖాదర్,అరుణ్ యాదవ్,బాగ్యరాజ్,అఖిలేందర్ తదితరులు పాల్గొన్నారు.(Story : కె.సి.ఆర్ ప్రజా సంక్షేమపరి పాలన )

