నిర్మాణం వేగవంతం చేయండి
న్యూస్ తెలుగు /సాలూరు : గృహ నిర్మాణం వేగవంతం చేయాలని గృహ నిర్మాణ సంస్థ జనరల్ మేనేజర్ వెంకటరమణ కోరారు. గురువారం సాలూరు మున్సిపాలిటీలో గుమడాం 4, 5 లే-ఔట్ లలో సందర్శించారు. ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయాన్ని సైతం అందించిందని ఆయన పేర్కొన్నారు. అదనపు సహాయం పొందిన లబ్ధిదారులు మరింత వేగవంతం చేయాలని పేర్కొన్నారు. నిర్మాణాలు పూర్తి చేయకపోతే నిబంధనల మేరకు రద్దు చేసే అవకాశాలు ఉంటాయని ఆయన తెలిపారు.1550 లబ్దిదారులకు అదనపు సహాయం పొందారని ఆయన చెప్పారు. జూన్ 10వ తేదీ లోగా బేస్మెంట్ స్థాయి నుండి బేస్మెంట్ స్థాయి నుంచి లింటెల్ స్థాయికి, లింటెల్ స్థాయి నుండి పైకప్పు వేసే స్థాయికి దశలు మారే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక ఇంజినీర్ జి.సోమేశ్వర రావు, సాలూరు మున్సిపాల్ కమీషనర్ కృష్ణా రావు, హౌసింగ్ సిబ్బంది, పాల్గొన్నారు. (Story :నిర్మాణం వేగవంతం చేయండి)

