Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఏపీఎస్ఎస్‌డిసి జాబ్ మేళ

ఏపీఎస్ఎస్‌డిసి జాబ్ మేళ

ఏపీఎస్ఎస్‌డిసి జాబ్ మేళ

న్యూస్ తెలుగు / వినుకొండ :   డిపార్ట్మెంట్ ఆఫ్ స్కీల్స్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ వారి అధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద(APSSDC) జాబ్ మేళను నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఈ. తమ్మాజి రావు మాట్లాడుతూ.  పి. అరుణ్ బాబు  ఐఏఎస్, జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ వారి అధేశాలమేరకు వినుకొండ శాసనసభసభ్యులు మరియు ప్రబుత్వ చీప్ విప్ జి.వి. ఆంజినేయులు అధ్వర్యంలో ఈ నెల 31 శనివారం స్థానిక గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఆవరణలో మెగా జాబ్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మెగా జాబ్ డ్రైవ్ ను వినుకొండ నియోజకవర్గ పరిసర ప్రాంత యువతి యువకులు అందరూ ఈ జాబ్ మేళా లో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనవలసిందిగా కోరారు. ఈ జాబ్ మేళాకు సుమారు 26 కంపెనీలు పాల్గొంటున్నాయి. ఉదాహరణకు  టెక్ మహేంద్ర,వి చేంజ్ సొల్యూషన్, హెటిరో డ్రగ్స్, మాస్టర్ మైండ్, వంటి పలు రకాల కంపెనీలు హాజరవుతున్నాయి అని తెలిపారు. జీతం వారి విద్యార్హతను బట్టి సుమారు 10000 – 40,000 రూపాయల వరకు ఉండవచ్చని అన్నారు.
ఈ జాబ్ డ్రైవ్ కు ఎస్.ఎస్.సి, ఇంటర్, ఐటియఐ, డిగ్రీ, బి.టేక్, డిప్లొమా,  ఫార్మసి,  మరియు పి.జి విభాగముల వరకు చదువుకున్నటు వంటి 18-40 సం.ల వయసు గల నిరుద్యోగ యువతి యువకులు వారి యొక్క బయోడేటా లేదా రెస్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్, ఆధార్ నకలు మరియు పాస్ పోర్ట్ ఫోటో తో నేరుగా ఇంటర్వ్యూ కు హాజరు కాగలరు. చిరునామా  ఈ నెల 31 శనివారం
సమయం ఉదయం 9 గం నుండి సాయంత్రం 04 గం వరకు ఇంటర్వూలు జరుగును. స్థలం. గవర్నమెంట్ జూనియర్ కళాశాల, బస్ స్టాండ్ దగ్గర, వినుకొండ , పల్నాడు జిల్లా. సంప్రదించవలసిన నంబర్లు డి. జానీ బాషా 9951214919, జె.సురేష్ 9100566581  ఏ. రమ్యా: 7702921219 ఔత్సాహిక యువతి యువకులు ముందుగా https://naipunyam.ap.gov.in/user-registration  అనే వెబ్ సైట్ నందు రిజిస్టర్ చేసుకోగలరు. మరిన్ని వివరములకు పైన తెలిపిన నంబర్లను సంప్రదించగలరు. గమనిక: రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోనటువంటి యువతీ యువకులు జాబ్ డ్రైవ్ జరుగు ప్రదేశం నందు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. (Story:ఏపీఎస్ఎస్‌డిసి జాబ్ మేళ )
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments