Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌కడప అమీన్‌పీర్ దర్గాను సందర్శించిన జీవీ 

కడప అమీన్‌పీర్ దర్గాను సందర్శించిన జీవీ 

కడప అమీన్‌పీర్ దర్గాను సందర్శించిన జీవీ 

న్యూస్ తెలుగు /వినుకొండ : ప్రసిద్ధి గాంచిన కడప నగరంలోని అమీన్ పీర్(పెద్దదర్గా)ను ప్రభుత్వ చీఫ్‌ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సందర్శించారు. గురువారం పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్, డీసీసీబీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి ఆయన దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత అయనకు దర్గా నిర్వాహకులు ముస్లిం సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. దర్గా చారిత్రక, సాంస్కృతిక విశిష్టతను వివరించారు. అనంతరం దర్గా సాంప్రదాయం పాటిస్తూ జీవీ ఆంజనేయులు, మక్కెనకు తలపాగా చుట్టి సత్కరించారు. అనంతరం పెద్ద దర్గాలోని హజరత్ పీరుల్లామాలిక్ సాహెబ్ మజార్‌ను దర్శించుకుని చాదర్ సమర్పించి దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేనీ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా చీఫ్‌విప్‌ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ. పెద్దదర్గాను సందర్శించడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. అక్కడి ప్రశాంత, ఆధ్యాత్మిక వాతావరణం తనను ఎంతో ఆకట్టుకుందన్నారు. కడపలో తొలిసారి నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం కావడం పట్ల చాలా ఆనందం గా ఉందన్నారు. రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలని, చంద్రబాబు సారథ్యంలో అన్నిప్రాంతాలు సర్వతోముఖాభివృద్ధిక చెందాలని ప్రార్ధించినట్లు తెలిపారు. ఈ పవిత్ర స్థలం ఐక్యతకు, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని… రాష్ట్ర ప్రజలందరూ శాంతి, సౌభ్రాతృత్వంతో జీవించాలని చిఫ్ విప్ జీవి ప్రార్థించా అన్నారు. (Story:కడప అమీన్‌పీర్ దర్గాను సందర్శించిన జీవీ )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!