గీతాంజలి విద్యార్థుల అభినందించిన చీఫ్ విప్ జీవి
న్యూస్ తెలుగు / వినుకొండ : పదో తరగతి పరీక్షలలో టౌన్ ఫస్ట్ సాధించిన గీతాంజలి విద్యార్థులను ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అభినందించారు. గీతాంజలి విద్యార్థులు టౌన్ ఫస్ట్ సాధించిన సందర్భంగా ఆ పాఠశాల లో జరిగిన అభినందన సభలో ప్రభుత్వ చిఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, గీతాంజలి డైరెక్టర్ వై శేషగిరిరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ. విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు కోసం ఈర్ష ద్వేషాలను ప్రక్కన పెట్టి ఇతరులు సాధించిన మంచి విషయాలను, విజయాలను అభినందించాలి. సంతోషంగా ఉంటూ అందరికీ అనుకూలంగా ఉంటూ మంచి వక్తలుగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అద్భుత విజయాలు సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. (Story:గీతాంజలి విద్యార్థుల అభినందించిన చీఫ్ విప్ జీవి)

