ఇంటర్మీడియట్ లో 995 మార్కులతో స్టేట్ 1 ర్యాంకు సాధించిన చరిత
న్యూస్‌తెలుగు/వనపర్తి : ఇంటర్మీడియట్ లో 995 మార్కులతో స్టేట్ 1 ర్యాంకు సాధించిన చరితను వనపర్తి కీర్తిని పెంచిన విద్యార్థినికి అఖిలపక్ష ఐక్యవేదిక ఘన సన్మానించారు. వనపర్తి పట్టణ జాగృతి కాలేజీలో చదువుతున్న పెబ్బేరు వాస్తవ్యులు నాగరాజు కుమార్తె M. చరిత 995/1000 మార్కులు తెచ్చుకొని, రాష్ట్రంలో పేరెన్నికగన్న కార్పొరేట్ కాలేజ్ లు సాధించని మార్కులను 995 సాధించి ,స్టేట్ ర్యాంకు తెచ్చుకుని వనపర్తి విద్యార్థిని సాధింంచిదని, కార్పొరేట్ కాలేజీలు వనపర్తి కాలేజీల ముందు దిగదుడుపు గా చేసిన ఈ విద్యార్థిని అందరికీ ఆదర్శమని, వనపర్తి దక్కిన వరం అని, మిగతా కాలేజీలు కూడా మంచి మార్కులు సాధించాయని వారందరికీ కూడా సన్మానం చేయడం జరుగుతుందని తెలిపారు. రానున్న రోజులలో విద్యార్థులు మరిన్ని ర్యాంకులు సాధించి వనపర్తి కాదు విద్యాపర్తి అని నిరూపించాలని సతీష్ యాదవ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాగృతి కళాశాల ప్రిన్సిపాల్, మేనేజ్మెంట్ వినోద్, శ్యామ్, భాస్కర్, సత్యనారాయణ, అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు సతీష్ యాదవ్, వెంకటేశ్వర్లు, కొత్త గొల్ల శంకర్, గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, శివకుమార్, పుట్టపాక బాలు, పాషా తదితరులు పాల్గొన్నారు. (Story:ఇంటర్మీడియట్ లో 995 మార్కులతో స్టేట్ 1 ర్యాంకు సాధించిన చరిత)