వినుకొండలో అగ్నిమాపక వారోత్సవాలు
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ అగ్నిమాపక వారోత్సవాలు సందర్భంగా ఐదవ రోజు సందర్భంగా వినుకొండ కేంద్రం యొక్క కేంద్రాధికారి మరియు సిబ్బంది వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో గల రిలయన్స్ పెట్రోల్ బంకు నందు సిబ్బందికి సాధారణంగా పెట్రోల్ బంకులలో సంభవించు ఆయిల్ ఫైర్స్ నుండి ఏ విధంగా బయటపడాలి అనేది అగ్నిమాపక పరికరములైన సి. ఓ 2, డీసీపీ ఏస్టింగ్ విషెర్స్ ఉపయోగించి అవగాహన కల్పించారు. పెట్రోల్ బంకులలో పని చేసే ప్రతి ఒక్క సిబ్బంది అగ్నిమాపక పరికరాలు యొక్క కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలని కేంద్ర అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో వినుకొండ అగ్నిమాపక కేంద్ర అధికారి బి. నాగేశ్వరరావు, లీడింగ్ ఫైర్ మాన్ కే. శ్రీనివాసరావు, డ్రైవర్ మరియు ఆపరేటర్స్ ఎస్వి. రమణారెడ్డి, కె. రవికుమార్, ఫైర్ మాన్స్ ఎస్ .కేశవ బాబు, జి. ప్రభాకర్ రెడ్డి, ఎం. కోటేశ్వరరావు, ఎస్.కె .మస్తాన్, ఎం. మల్లికార్జునరావు, హోంగార్డ్స్ జి .రామకృష్ణారావు, పి. భాష ఖాన్, డి.మస్తాన్ వలి ,ఎ. శ్రీను పాల్గొనడం జరిగింది. (Story:వినుకొండలో అగ్నిమాపక వారోత్సవాలు)