ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు
న్యూస్ తెలుగు/సాలూరు : టీటీడీ గోశాల పై తప్పుడు ప్రచారం చేసి ప్రజల మనోభావాల తో ఆటలాడవద్దని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు బుధవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫేక్ న్యూస్ లు సృష్టించదంలో జగన్మోహన్ రెడ్డి ముందు వరుసలో ఉంటాడని అన్నారు. ప్రజలను గందరగోళనికి గురిచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మూడు మతాల మధ్య చిచ్చు పెట్టాలని కుయశక్తులు పన్నుతున్నారని అన్నారు.మరో చాన్స్ కోసం కుట్ర పూరిత ప్రచారాలు… విషపూరిత రాతలు రాస్తూ టీటీడీ గోశాలపై తప్పుడు ప్రచారం చేసి.. ప్రజల మనోభావాలతో ఆటలు ఆడుకుంటున్నారని అన్నారు.పాస్టర్ మృతిపై తప్పుడు ఆరోపణలు… కులాల కుంపటి రగిలించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు.వక్ఫ్ బోర్డు బిల్లుపై లోక్ సభలో ఒకలా, రాజ్యసభలో మరోలా, కోర్టులో ఇంకో విధానమా?అని ప్రశ్నించారు.అసెంబ్లీకి వెళ్లకుండా తన వారితో విద్వేషపూరిత ప్రచారం చేస్తున్నరని తెలిపారు.తప్పుడు రాతలు రాసే సాక్షి.. వైసీపీ కరపత్రం అన్నారుస్ధానిక సంస్థల ఎన్నికల్లో మీరు చేసిన దౌర్జన్యాలు ప్రజలంతా మర్చిపోలేదు తెలిపారు.151 నుండి 11 కు దిగజారినా బుద్ధి రాలేదా?? ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రజలు శిక్షించారు అని తెలిపారు.దళిత గిరిజనుల అభివృద్ధికి జగన్ చేసింది శున్యంమని అన్నారు.ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.33 వేల కోట్లు దారిమళ్లించారని తెలిపారు.I ఐటీడీఏ లను, ఎస్ సి సోసైటీలను నిర్వీర్యం చేసి, మోసం చేశారు అని తెలిపారు.
గత ఐదేళ్లలో ధరలు ఆకాశాన్ని తాకాయి.. ప్రజల గుండెలు భగభగ మండాయిని విమర్శించారు.
అంబేద్కర్ విదేశీ విద్యకు, అంబేద్కర్ పేరును తొలగించి జగన్ పేరు పెట్టుకుని ఆయనను అవమానించలేదా? అని ప్రశ్నించారు.గత ఐదేళ్లలో రోడ్లను, భవనాలను, కార్యాలయాలను సర్వనాశనం చేశారని అన్నారు.దళిత గిరిజనుల సంక్షేమం కోసం చంద్రబాబు కృషి చేస్తున్నారు తెలియజేశారు.పి 4 ద్వారా నిరుపేదల జీవితాలు మారబోతున్నాయి అని తెలిపారు.పేదరికం లేని సమాజం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని తెలిపారు.తిరుమలలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా ఆ కలియుగ వెంకటేశ్వరుని పైన ఎంతో నమ్మకంతో తలనీలాలు ఇచ్చి ఒకరోజు భక్తులకు అన్నప్రసాదం కోసం 17 లక్షలు విరాళంగా ఇచ్చిన భక్తురాలిని విమర్శిస్తే ఆ ఆ కలియుగ వెంకటేశ్వరుడు ఊరుకోడని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో సాలూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ , పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు , మండల అధ్యక్షుడు పరమేశు, మక్కువ మండల అధ్యక్షుడు గుళ్ళ వేణుగోపాల్ నాయుడు, మెంటాడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చలుమూరు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.(Story : ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు )