బి.ఆర్ అంబేద్కర్ జయంతి
న్యూస్‌తెలుగు/వనపర్తి బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ చౌక్ లో బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ అంబేద్కర్ అంటే ఈ దేశ భవిష్యత్తు అని , ఆయన వేసిన బాటలో రాజ్యాంగం నడుస్తుందని, దాని ప్రకారం ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారని, ప్రశ్నించే అధికారం కూడా వచ్చిందని, శతాబ్దం తర్వాత కూడా ఆయనను ఒక వర్గానికి నాయకుడుగా పరిగణిస్తున్న వారు అజ్ఞానులని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, బిసి జిల్లా నాయకులు గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, డీఎస్పీ పట్టణ అధ్యక్షుడు గంధం భరత్, మిద్దె నగేష్, శివకుమార్, శ్రీధర్ గౌడ్,పుట్టపాక బాలు, పాషా, కురుమూర్తి, పులు సంఘాల నాయకులు పాల్గొన్నారు. (Story :బి.ఆర్ అంబేద్కర్ జయంతి)