సిపిఐ ఆధ్వర్యంలో బాబు జగజ్జివన్ రామ్ జయంతి.
న్యూస్ తెలుగు / వినుకొండ : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై పాటుపడిన మహోన్నత వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్ అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద గల బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సిపిఐ వినుకొండ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతిపిన్న వయసులోనే శాసనసభ సభ్యునిగా గెలుపొంది దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై బీహార్ శాసనసభలో ఆయన గళం ఎత్తి వినిపించారని పేదలు ధనికులు అనే వ్యత్యాసం లేని సమ సమాజం కావాలని కలలు కన్నాడని, భారత రాజ్యాంగ సభలో సభ్యునిగా కొనసాగి రాజ్యాంగంలో బలహీన వర్గాలకు న్యాయం జరగటం కోసం వారి హక్కులను రాజ్యాంగంలో చేర్చుటకు పోరాటం చేశారని అన్నారు. శాసనసభలోను కేంద్రంలోనూ సుమారు 35 సంవత్సరాలు అనేక పదవులు అలంకరించి తుదకు దేశ ఉప ప్రధాని పదవిని కూడా ఆయనను వరించిందని దేశ సేవలో అత్యున్నత పురస్కారాలు అందుకున్నారని పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి యుద్ధాల సమయంలో దేశ రక్షణలో రాజీలేని పోరాటం చేశారని.దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో కూడా ప్రజల గొంతుకై వినిపించి ఎమర్జెన్సీని వ్యతిరేకించి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ జె ని స్థాపించారని అన్నారు. జయప్రకాష్ నారాయణతో కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో పనిచేశారని రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుటలో బాబూ జగ్జీవన్ రామ్ ఒక దళిత నేతగా ప్రత్యేక పాత్ర పోషించారని అన్నారు. సిపిఐ వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజల కోసం నిరంతరం పోరాటాలు చేస్తోందని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ఆశయాలు కూడా బడుగు బలహీన వర్గాలను ఉన్నత స్థాయికి తీసుకొని రావడం సమ సమాజం కోసం పేద ధనిక వర్గాల వ్యత్యాసాలు లేని ప్రజాస్వామ్య భారతదేశ కోసం ఆయన పోరాడారని ఆయన ఆశయాల బాటలో మేము పయనిస్తామని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ వినుకొండ నియోజకవర్గ కమిటీ సభ్యులు పిన్న బోయిన వెంకటేశ్వర్లు, కొప్పరపు మల్లికార్జున, సిహెచ్ రవి, దారి వేముల మరీయ బాబు, పొట్లూరు వెంకటేశ్వర్లు, సూపర్ స్కైలాబ్, తదితరులు పాల్గొని నివాళులర్పించారు .(Story : సిపిఐ ఆధ్వర్యంలో బాబు జగజ్జివన్ రామ్ జయంతి.)