ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు సుభిక్షంగా ఉండాలి
శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : తెలుగు నూతన విశ్వవసు నామ సంవత్సరం(ఉగాది)సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు సుభిక్షంగా ఉండాలి అని వర్షాలు సమృద్ధిగా కృషి పంటలు బాగా పండి రైతులు ప్రజలు సుఖశాంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అద్భుతంగా జరిగిందని తిరుమలలో పరిశుభ్రత,సిబ్బంది సేవలు బాగున్నాయి అని అన్నారు. నిరంజన్ రెడ్డి వెంట వారి వియ్యంకుడు శ్రీధర్ రెడ్డి,వ్యక్తిగత సిబ్బంది యాదగిరి,శ్రీను రమేష్ ఉన్నారని అశోక్ తెలిపారు.(Story : ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు సుభిక్షంగా ఉండాలి)