దేశ లౌకిక వ్యవస్థను రక్షించాలి సిపిఐ
న్యూస్ తెలుగు /వినుకొండ : భారత రాజ్యాంగాన్ని, దేశ లౌకిక వ్యవస్థను రక్షించాలని పిలుపునిస్తూ .,కేంద్రంలో మోడీ సాగిస్తున్న నిరంకుశ, మతోన్మాద పరాకాష్టకు చేరిన రాక్షస పాలన కు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం లోని బొల్లాపల్లి మండలం లో బుధవారం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఐ బొల్లాపల్లి మండల కార్యదర్శి పిన్నబోయిన వెంకటేశ్వర్లు సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమం మండల కేంద్రమైన బొల్లాపల్లి, వెళ్లటూరు , అయన్న పాలెం ,మేకలు దీన్నే, బండ్లమోటు తదితర గ్రామాలలో విస్తృతంగా పర్యటించి ప్రచార కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భంగా సిపిఐ వినుకొండ నియోజకవర్గం కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం తన సుదీర్ఘ పాలనలో దేశానికి నష్టం చేకూర్చడం తప్ప ప్రజలకు మేలు చేసింది ఏమీ లేదన్నారు. లౌకిక భారతదేశంలో హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని నరేంద్ర మోడీ దేశంలో అరాచకాలకు తెర లేపాడని, మైనార్టీలు -దళితులపై తీవ్రమైన ఊచకోత కోస్తూ దేశంలోమతం పేరుతో మారన హోమం సాగిస్తున్నాడని బూదాల శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే వక్ బోర్డు లో సంస్కరణల పేరుతో మైనార్టీలకు చెందిన ఆస్తులను కొల్లగొట్టేందుకు మోడీ ప్రయత్నాన్ని లౌకికవాదులు వ్యతిరేకించాలని వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రజలు సంఘటితమై పోరాడాలని కోరారు”. కార్యక్రమంలో మండల కార్యదర్శి పిన్నబోయిన వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకులు రాయబారం వందనం , కొప్పరపు మల్లికార్జున రావు, చింతపల్లి రవి ,షేక్ సైదా, ఎం నరసింహారావు, ఎం. రామకోటి, రమేషు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : దేశ లౌకిక వ్యవస్థను రక్షించాలి సిపిఐ )