ఏపీ ఈఏపీసెట్-2025 పూర్తి వివరాలు
ఏపీ ఈఏపీసెట్2025 దరఖాస్తుకు వేళాయో…
ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ
మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు
మే 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్
వాట్సాప్ ద్వారా హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్
న్యూస్ తెలుగు/అమరావతి: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ 2025 పరీక్షకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఇంటర్ మీడియట్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులైన వారుగానీ, చివరి ఏడాది చదువుతున్న వారుగానీ దీనికి దరఖాస్తు చేయవచ్చు. 2025-26 విద్యా సంవత్సర ప్రవేశాలకుగాను ఇంటర్ మార్కులకు వెయిటేజీ కల్పించారు. దీంతో ఏపీ ఈఏపీసెట్‌లో ర్యాంక్ కొట్టాలంటే..ఇంటర్ మార్కులు కీలకం కానున్నాయి. ఏపీ ఈఏపీసెట్ 2025 ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ కళాశాలల్లో మూడు విభాగాలుగా కోర్సులను కేటగించారు. 2025-26 విద్యా సంవత్సరానికిగాను మొదటి సంవత్సరంలో ప్రవేశాలకుగాను విభాగం(ఏ)లో ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, బి.టెక్ (డైరీ టెక్నాలజీ), బి.టెక్ (అగ్రి ఇంజినీరింగ్), బి.టెక్ (ఫుడ్ సైన్స్‌అండ్ టెక్నాలజీ) కోర్సులు ఉంటాయి. బి.కేటగిరిలో బిఎస్సీ (అగ్రికల్చర్)/బిఎస్సీ(హార్టికల్చర్), బీవీఎస్‌సీ అండ్ ఏహెచ్/బీఎఫ్‌ఎస్‌సీ కోర్సులను అందుబాటులో ఉంచారు. సి.కేటగిరిలో ఇ.ఫార్మసీ, ఫార్మా.డి కోర్సులను ఏర్పాటు చేశారు. ఈ విడత ఏపీ ఈఏపీసెట్‌కు జేఎన్టీయూ(కాకినాడ) కన్వీనర్‌గా వ్యవహరిస్తోంది.
మే 19 నుంచి ఆన్‌లైన్‌లో పరీక్షలు
మే 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఏపీఈఏపీసెట్‌కు ఆన్‌లైన్ పరీక్షలను వివిధ సెషన్ల ద్వారా నిర్వహిస్తారు. మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలు జరుగుతాయి. మే 21 నుంచి 27 తేదీల వరకు ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు కొనసాగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం వరకు రెండో సెషన్ ఉంటుంది. మే 25వ తేదీన ఈ పరీక్షకు అనేక సెషన్లు నిర్వహిస్తారు. 24వ తేదీన మాత్రం ఒక సెషన్‌తోనే సరిపెడతారు. ఈ పరీక్షకు జనరల్ అభ్యర్థులకుగాను రూ.600 ఫీజు, ఎస్సీ, ఎస్టీలకు రూ.500, బీసీలకు రూ.550 చొప్పున ఫీజు నిర్ధారించారు. ఇంటర్ మీడియట్‌లో అభ్యర్థులు సాధించిన మార్కులకుగాను 25 శాతం వెయిటేజీ ఏపీ ఈఏపీసెట్‌లో కల్పిస్తారు. మొత్తంగా ఏపీ ఈఏపీసెట్ 2025, ఇంటర్ మీడియట్ మార్కుల వెయిటేజీ అభ్యర్థులకు ర్యాంకింగ్ ఇస్తారు. https://cets.apsche.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా లాగిన్‌అయి..5 విభాగాలుగా ఉన్న వివరాలను నమోదు చేసి..దరఖాస్తు చేయవచ్చు. సిలబస్, పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లోని ప్రత్యేక బుక్‌లెట్‌ల ద్వారా అందుబాటులో ఉంచారు. ఆన్‌లైన్ ద్వారా ఆయా విభాగాలకు చెందిన మాక్‌టెస్ట్‌ల సౌకర్యాన్ని కల్పిస్తారు.
ఏపీ ఈఏపీసెట్ దరఖాస్తులకు తేదీల ఇలా…
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 15.3.2025
ఆలస్య రుసుం లేకుండా : 24.4.2025
రూ.1000 అపరాధ రుసుముతో: 1.5.2025
రూ.2వేల అపరాధ రుసుముతో : 7.5.2025
రూ.4వేల అపరాధ రుసుముతో : 12.5.2025
రూ.10వేల అపరాధ రుసుముతో: 16.5.2025
ఆన్‌లైన్‌లో ఈ పత్రాలు దాఖలు చేయాల్సిందే..
ఏపీ ఈఏపీసెట్ 2025 దరఖాస్తు ప్రక్రియలో భాగంగా ఆన్‌లైన్లో తొలుత అభ్యర్థుల ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర హాల్ టిక్కెట్ నమోదు చేయాలి. పదో తరగతి హాల్ టిక్కెట్ నంబరు, పుట్టిన తేదీ, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ నంబర్, పీహెచ్, ఎన్‌సీసీ, స్పోర్ట్సు ఉంటే..సంబంధిత పత్రాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రం (రూ.2లక్షల లోపు), రేషన్ కార్డు, స్టడీ లేదా రెసిడెన్సి సర్టిఫికెట్ల పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. ఈ పరీక్షల ప్రక్రియ పూర్తయిన అనంతరం ఆన్‌లైన్ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. (Story: ఏపీ ఈఏపీసెట్-2025 Full Details)
Follow the Stories:
పర్యవేక్షణ నిల్..ఫలహారం పుల్!
జగన్ చుట్టూ కోటరీ ఎవరు?
Friday Fear: మరో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!
రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు
కొత్త రేషన్ కార్డులొస్తున్నాయి!
సిటీ కిల్లర్ వచ్చేస్తోంది! ముంబయికి ముప్పు?
సడెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్!
నిరుద్యోగులకు మోదీ బంపర్ ఆఫర్!
మారిన జగన్ వ్యూహరచన: జగన్ 2.0 అంటే ఇదేనేమో!
మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)
వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైరస్!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి
దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు!
జైల్లో నా భర్తను.. టార్చర్ చేస్తున్నారు..!