Homeవార్తలుఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కంప్లీట్ ప్యాకేజ్  "దిల్ రూబా" 

ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కంప్లీట్ ప్యాకేజ్  “దిల్ రూబా” 

ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కంప్లీట్ ప్యాకేజ్ 

“దిల్ రూబా” 

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా: 
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా “దిల్ రూబా”. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. “దిల్ రూబా” చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్,  ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. “దిల్ రూబా” సినిమా ఈనెల 14న హోలీ పండుగ సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్  ఈ రోజు హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – “దిల్ రూబా” సినిమా గురించి వీలైనంతగా మిమ్మల్ని కలిసి చెబుతూ వస్తున్నాం. ఈ రోజు ప్రీమియర్స్ పడుతున్నాయి. సినిమా స్క్రీన్స్ మీదకు వచ్చే ముందు మరోసారి మా సినిమా గురించి మాట్లాడాలని మీ ముందుకు వచ్చాం. “దిల్ రూబా” సినిమా ఫస్ట్ 30 మినిట్స్ సరదగా వెళ్తూ ఆ ముప్పై నిమిషాల తర్వాత కథలోకి తీసుకెళ్తుంది. ఈ కథలో ప్రేమ ఒక్కటే కాదు స్నేహం, ఫాదర్ సన్, ఫాదర్ డాటర్ రిలేషన్..ఇలా అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఎక్స్ లవర్ మళ్లీ ఆ ప్రేమికుడి జీవితంలోకి వచ్చి అతని ప్రెజెంట్ లవ్ ను కలిపే ప్రయత్నం చేయడం అనేది “దిల్ రూబా”లో కొత్తగా ఉంటుంది. మాజీ ప్రేయసి, ప్రేమికుడు అంటే శత్రువులా చూడాల్సిన పనిలేదు. వారితోనూ స్నేహాన్ని కొనసాగించవచ్చు అనే ఫీల్ గుడ్ ఎలిమెంట్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మీరు మీ ఫ్యామిలీతో వచ్చి హాయిగా ఈ సినిమా చూడొచ్చు. ఎలాంటి ఇబ్బందికర డైలాగ్స్, సన్నివేశాలు ఉండవు. ఈ మూవీలో నటించిన తర్వాత నటుడిగా ఇంకాస్త పరిణితి సాధించా అనిపించింది. ఫైట్స్ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నాను. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే లెంగ్తీ ఫైట్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాను. మంగళూరులో హాట్ సమ్మర్ లో ఆ సీక్వెన్స్ ఎనిమిది రోజుల పాటు చేశాం. ఆ ఫైట్ మీకు బాగా నచ్చుతుంది. అందుకే మా ప్రొడ్యూసర్ రవి గారు కూడా ఫైట్స్ గురించి కొంచెం బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. రుక్సర్, క్యాతీ క్యారెక్టర్స్ ఆకట్టుకుంటాయి. అలాగే మా డైరెక్టర్ కు ఈ సినిమా తర్వాత మంచి పేరొస్తుంది. ఆయన ఈ మూవీ కోసం రాసిన డైలాగ్స్ అప్పట్లో పూరి గారి మూవీస్ ను గుర్తుకుతెస్తాయి. క సినిమా కంటెంట్ , స్క్రీన్ ప్లే మీద వెళ్తుంది. ఆ సినిమా సక్సెస్ ను ప్రెడిక్ట్ చేయొచ్చు కానీ దిల్ రూబా మ్యాజిక్ మూవ్ మెంట్స్ మీద వెళ్లే కమర్షియల్ మూవీ. ఈ కథకు మీరు కనెక్ట్ అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఉహించనంత రేంజ్ కు వెళ్తుంది. దిల్ రూబా థియేటర్స్ లో చూసి మీ రెస్పాన్స్ తెలియజేస్తారని వేచి చూస్తున్నాం. అన్నారు.

డైరెక్టర్ విశ్వకరుణ్ మాట్లాడుతూ – దిల్ రూబా సినిమా మరికొద్ది సేపట్లో థియేటర్స్ లోకి వస్తోంది. మేమంతా ఎగ్జైటెడ్ గా వేచి చూస్తున్నాం. మనం ఏ వార్త చూసినా మనుషుల మధ్య తగ్గిపోయిన విలువలు, బంధాల గురించే ఉంటున్నాయి. అవి చూశాక దిల్ రూబా లాంటి కథ రాయాలని అనిపించింది. ఒక క్యారెక్టర్ కోసం బతికే వ్యక్తి హీరో. ఈ సినిమాలో నేను రాసిన డైలాగ్స్ బాగున్నాయని ప్రమోషనల్ కంటెంట్ చూసిన వారు చెబుతున్నారు. కథ డిమాండ్ చేసిన మేరకే నేను ఆ డైలాగ్స్ రాయగలిగాను. దిల్ రూబా కంటెంట్ చూశాక పూరి జగన్నాథ్ గారు ఫోన్ చేసి మాట్లాడారు. అలాగే దర్శకుడు మెహర్ రమేష్ కూడా కంటెంట్ బాగుందని చెప్పారు. ఇలా పెద్ద వాళ్లు ఫోన్ చేసి మాట్లాడటం సంతోషంగా ఉంది. కిరణ్ గారిని ఈ సినిమాలో కొత్తగా చూస్తారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి మీరు ఇచ్చే రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నాం. దిల్ రూబా రిలీజ్ తర్వాత నా కొత్త మూవీ గురించి చెబుతా.

హీరోయిన్ క్యాతీ డేవిసన్ మాట్లాడుతూ – దిల్ రూబా సినిమాలో మ్యాగీ క్యారెక్టర్ చేశాను. ఇలాంటి మంచి రోల్ తో మీకు పరిచయం కావడం సంతోషంగా ఉంది. కిరణ్ గారితో పాటు మిగతా టీమ్ అందరితో వర్కింగ్ ఎక్సిపీరియన్స్ చాలా బాగుంది. మీరంతా తప్పకుండా దిల్ రూబా సినిమా చూడాలని కోరుకుంటున్నా. ఈ సినిమా మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తుంది, అలాగే ఎమోషనల్ ఫీల్ అవుతారు. దిల్ రూబా చూసి మీరు ఫీడ్ బ్యాక్ ఇస్తారని మా టీమ్ అంతా ఆశిస్తున్నాం. అన్నారు.

డీవోపీ డేనియల్ విశ్వాస్ మాట్లాడుతూ – దిల్ రూబా కథ విన్నప్పుడే ఈ చిత్రంలో కిరణ్ ఎంత బాగా నటిస్తాడు, డైరెక్టర్ ఎంత బాగా రూపొందిస్తాడు అనేది ఊహించగలిగాను. ఈ సినిమా ఫ్యామిలీ అందరికీ నచ్చేలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు.

ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్ మాట్లాడుతూ – దిల్ రూబా సినిమా కిరణ్ గారిని కొత్తగా చూపిస్తుంది. ఈ సినిమా మేకింగ్ మంచి క్వాలిటీతో ఉంటూ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇదొక యూత్ ఫుల్  లవ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ మూవీ. మంచి యాక్షన్ సీక్వెన్సులు, సాంగ్స్ తో పాటు హీరో హీరోయిన్స్ పర్ ఫార్మెన్స్ లు హైలైట్ గా నిలుస్తాయి. అన్నారు.

నటీనటులు – కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్, క్యాతీ డేవిసన్, సత్య, తదితరులు

టెక్నికల్ టీమ్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్) & దుడ్డి శ్రీను.
ప్రొడక్షన్ డిజైనర్ – సుధీర్
ఎడిటర్ – ప్రవీణ్.కేఎల్
సినిమాటోగ్రఫీ – డానియేల్ విశ్వాస్
మ్యూజిక్ – సామ్ సీఎస్
నిర్మాతలు – రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి,  విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్
రచన, దర్శకత్వం – విశ్వ కరుణ్ (Story: ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కంప్లీట్ ప్యాకేజ్  “దిల్ రూబా” )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!