అద్భుత విజయం: సెమీఫైనల్స్‌లో టీమిండియా
వరుణ్ చక్రవర్తి దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్
ఛాంపియన్స్ ట్రోఫీ ఆఖరి లీగ్‌లో కివీస్‌పై భారత్ జయభేరి
దుబాయ్: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్‌లోకి టీమిండియా అడుగుపెట్టింది. భారతజట్టు సమష్టి పోరుతో జయభేరి మోగించింది. ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో భారత్ 44 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై తిరుగులేని విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు మాత్రమే చేసినప్పటికీ, కివీస్‌ను తన బౌలింగ్, ఫీల్డింగ్‌తో నియంత్రించి 205 పరుగులకే కుప్పకూల్చింది. న్యూజిలాండ్ ఇంకా 4.3 ఓవర్లు మిగిలిఉండగానే వరుణ్ ధాటికి ఇన్నింగ్స్‌కు తెరదించింది. ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంటులో సెమీఫైనల్స్ స్థానం కోసం గట్టిపోటీనే జరిగింది. ఆదివారంనాడు ఇక్కడ జరిగిన గ్రూప్`ఏ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. వరుణ్ చక్రవర్తి అద్భుతమైన బౌలింగ్, శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్, హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రతిభ..వెరసి టీమిండియాకు విజయాన్ని చేకూర్చిపెట్టాయి. వరుణ్ చక్రవర్తి మొదటిసారి వన్డేల్లో 5 వికెట్లు తీసుకొని జట్టు విజయంలో కీలక పాత్ర వహించి, మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నాడు.
స్పిన్ తిప్పేసింది!
250 పరుగుల స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఉత్సాహంతో బ్యాటింగ్‌ను మొదలుపెట్టింది. కానీ హార్దిక్ పాండ్యా బ్రేక్‌త్రూ సాధించి భారత శిబిరంలో ఆనందాన్ని నింపాడు. పాండ్యా బౌలింగ్‌లో అక్షర్ పటేల్ పట్టిన క్యాచ్‌కు ఓపెనర్ రచిన్ రవీంద్ర (6) పెవిలియన్‌దారి పట్టాడు. ఆ తర్వాత విల్ యంగ్, కేన్ విలియమ్సన్‌లు స్కోరుబోర్డును కుదటపరిచే ప్రయత్నం చేశారు. కాకపోతే వరుణ్ చక్రవర్తి సంధించిన లైన్ అండ్ లెన్త్ బంతికి విల్ యంగ్ (22) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి కివీస్ స్కోరు అర్థసెంచరీ దాటలేదు. ఆ తర్వాత విలియమ్సన్‌కు డారిల్ మిఛెల్ తోడయ్యాడు. కాకపోతే కుల్‌దీప్ యాదవ్ రంగంలోకి దించిన రోహిత్ సఫలీకృతుడయ్యాడు. మిఛెల్ (17) అనూహ్యంగా కుల్‌దీప్ ఎల్బీకి చిక్కాడు. విలియమ్సన్, టామ్ లాథమ్‌లు నెమ్మదిగా ఆడుతూ స్కోరును పెంచుతూ వచ్చారు. కాకపోతే రవీంద్ర జడేజా స్పిన్ బంతికి లాథమ్ (14) ఎల్‌బీడబ్ల్యుగా వెనుదిరిగాడు. ఈ దశలో కేన్ విలియమ్సన్ వికెట్టు అత్యంత కీలకమైన టీమిండియాకు తెలుసు. అందుకే అతనిపై దృష్టిపెట్టిన రోహిత్ శర్మ బౌలర్లను మారుస్తూ ప్రయోగాలు చేసి మరోసారి సఫలీకృతుడయ్యాడు. విలియమ్సన్ వికెట్టును సాధించలేకపోయినప్పటికీ, ఫిలిప్స్ (12), బ్రేస్‌వెల్ (2) వికెట్లను వరుణ్ చక్రవర్తి పడగొట్టాడు. రెండూ ఎల్బీలే కావడం విశేషం. విలియమ్సన్, శాంట్నర్‌లు భారత బౌలర్లపై ఒత్తిడి పెంచారు. కానీ రోహిత్ వ్యూహం మార్చి అక్షర్‌కు మళ్లీ బంతి ఇచ్చాడు. దీంతో 42వ ఓవర్‌లో అక్షర్ వేసిన తొలి బంతికే భారీ షాట్ కోసం ఫ్రంట్‌ఫుట్ వేసిన విలియమ్సన్ కీపర్ రాహుల్ స్టంపింగ్‌తో అవుటయ్యాడు. విలియమ్సన్ 120 బంతుల్లో 7 బౌండరీలతో 81 పరుగులు చేశాడు. కెప్టెన్ శాంట్నర్ అక్షర్, వరుణ్ ఓవర్లలో చెరొక సిక్స్ కొట్టి తమ శిబిరంలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశాడు. కుల్‌దీప్ బౌలింగ్‌లో ఒక బంతిని బౌండరీకి కూడా తరలించాడు. కాకపోతే వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఊహించని విధంగా క్లీన్‌బౌల్డ్ కావడం కివీస్‌ను దెబ్బతీసింది. భారత బౌలర్లను భయపెట్టిన శాంట్నర్ 31 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 28 పరుగులు చేశాడు. అదే ఓవర్‌లో వరుణ్ మరో బ్యాట్స్‌మన్ హెన్రీని (కోహ్లీ క్యాచ్) కూడా పెవిలియన్‌కు పంపించాడు. వరుణ్ తొలిసారి వన్డేల్లో 5 వికెట్లు సాధించాడు. హెన్రీ (2), జేమీసన్ (9), రూర్కీ (1)లు పెద్ద ప్రభావం చూపలేదు. కుల్‌దీప్ బౌలింగ్‌లో రూర్కీ ఆఖరి వికెట్టుగా అవుటయ్యాడు. భారత బౌలర్లలో వరుణ్ 5 వికెట్లు తీసుకోగా, కుల్‌దీప్ 2, అక్షర్, జడేజాలు చెరో వికెట్టు తీసుకున్నారు.
ఆదుకున్న శ్రేయాస్ అయ్యర్
అంతకుముందు, టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కివీస్ ఆటగాళ్లు కట్టుదిట్టమైన ఫీల్డింగ్, బౌలింగ్‌తో భారత దూకుడుకు అడ్డుకట్ట వేశారు. వారి బ్యాటింగ్‌ను తెలివిగా నియంత్రించారు. ముఖ్యంగా మట్ హెన్రీ అద్భుతమైన బౌలింగ్‌తో భారత టాప్‌ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఒక దశలో భారత్ 30 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి తీవ్రమైన కష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఓపెనర్లు ఇద్దరూ తొలి ఆరు ఓవర్లలోనే పెవిలియన్ దారిపట్టారు. శుభ్‌మన్ గిల్ (2) హెన్రీ ఎల్బీకి దొరికిపోగా, రోహిత్ శర్మ (15) కైల్ జేమీసన్ బౌలింగ్‌లో విల్ యంగ్ పట్టిన క్యాచ్‌కు అవుటయ్యాడు. రోహిత్ శర్మ ఒక ఫోర్, సిక్సర్‌తో ఊపులో ఉన్నప్పటికీ, భారీషాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. విరాట్ కోహ్లీ (11) కూడా హెన్రీ బౌలింగ్‌లో ఫిలిప్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. ఈ దశలో అక్షర్ పటేల్, శ్రేయాస్ అయ్యర్‌ల భుజస్కందాలపై బ్యాటింగ్ భారం పడిరది. వీరిద్దరూ మంచి సమన్వయంతో ఆడుతూ స్కోరు బోర్డును నెమ్మదిగా ముందుకు నడిపించారు. వారు నాల్గవ వికెట్టుకు 136 బంతుల్లో 98 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం అందించారు. జట్టు స్కోరు 128 వద్ద ఉన్నప్పుడు అక్షర్ పటేల్ అనూహ్యంగా రచిన్ రవీంద్ర బౌలింగ్ విలియమ్సన్‌కు క్యాచ్ అవుటయ్యాడు. అక్షర్ 61 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 42 పరుగులు చేశాడు. ఒంటరిగా పోరాడుతున్న శ్రేయాస్ అయ్యర్ 37వ ఓవర్‌లో విల్ రూర్కీ బౌలింగ్‌లో యంగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అతను 98 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 79 పరుగులు చేశాడు. భారత బ్యాట్స్‌మన్లలో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం. ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ (29), రవీంద్ర జడేజా (16), షమీ (5), కుల్‌దీప్ యాదవ్ (1)లు పెద్దగా రాణించకపోయినప్పటికీ, హార్దిక్ పాండ్యా మాత్రం మెరుపులు మెరిపించి, ఆఖర్లో భారత స్కోరును పెంచేశాడు. పాండ్యా 45 బంతుల్లో 4 ఫోర్లు, 2 భారీ సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. అతను కూడా హెన్రీ బౌలింగ్‌లో రవీంద్రకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కివీస్ బౌలర్లలో మట్ హెన్రీ 8 ఓవర్లలో 42 పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకోగా, జామీసన్, రూర్కీ, శాంట్నర్‌లు తలో వికెట్టు తీసుకున్నారు. విలియమ్సన్ టెరిఫిక్ మ్యాచ్ మిస్ అయివుంటే జడేజా (16) మరికాస్త నిలబడేవాడు. (Story: అద్భుత విజయం: సెమీఫైనల్స్‌లో టీమిండియా)
Follow the Stories:
Friday Fear: మరో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!
రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు
కొత్త రేషన్ కార్డులొస్తున్నాయి!
సిటీ కిల్లర్ వచ్చేస్తోంది! ముంబయికి ముప్పు?
సడెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్!
నిరుద్యోగులకు మోదీ బంపర్ ఆఫర్!
మారిన జగన్ వ్యూహరచన: జగన్ 2.0 అంటే ఇదేనేమో!
మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)
వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైరస్!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి
దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు!
జైల్లో నా భర్తను.. టార్చర్ చేస్తున్నారు..!