ముగిసిన అంగన్వాడి శిక్షణ తరగతులు
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ అర్బన్ నందు ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్ నందు 120 రోజుల అంగన్వాడీ టీచర్లకు శిక్షణ కార్యక్రమం ముగింపు ఉత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ సయ్యద్ జఫ్రోల్లా ఖాన్ విచ్చేసి ప్రసంగించారు. ట్రైనర్స్ సూపర్వైజర్స్ శ్రీలత, షీల, దివ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆరు రోజుల శిక్షణ కార్యక్రమంలో సాల్ట్ గురించి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఈసీ గురించి చక్కగా వివరించారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లల్లో మెదడు అభివృద్ధి శాతం పెరుగుతుందని, ఈ వయసులో పిల్లలను సమగ్ర అభివృద్ధి జరగాలని, పిల్లల్లో శారీరక, మానసిక భాష మేధో మరియు సృజనాత్మకత అభివృద్ధిలో జరగాలని, అభివృద్ధి జరగకపోతే పిల్లల్లో వచ్చే సమగ్ర అభివృద్ధి జరగదని టీచర్లకు మంచిగా అవగాహన కలిగించారు. వివిధ రకాలైన టి ఎల్ ఎం ను ఎలా తయారు చేసుకోవాలో తెలిపారు. గ్రాడ్యుయేషన్ డే వెల్కమ్ చెప్పడం వల్ల పిల్లల్లో అభివృద్ధి చక్కగా జరుగుతుందని అంగన్వాడీ టీచర్లకు అవగాహన కలిగించారు. ఈ శిక్షణ వలన అంగనవాడి కార్యకర్తలకు వారి నైపుణ్యాలు మరింతగా మెరుగుపరుచుకోవడం జరిగింది. (Story : ముగిసిన అంగన్వాడి శిక్షణ తరగతులు)