Homeఅవీఇవీ!సామాన్యులకు వరం: పోస్ట‌ల్‌లో అదిరిపోయే బీమా ప‌థ‌కాలు

సామాన్యులకు వరం: పోస్ట‌ల్‌లో అదిరిపోయే బీమా ప‌థ‌కాలు

సామాన్యులకు వరం: పోస్ట‌ల్‌లో అదిరిపోయే బీమా ప‌థ‌కాలు

సూప‌ర్ ఇన్సూరెన్స్ ప‌థ‌కాల‌తో స‌రికొత్త‌గా త‌పాలాశాఖ‌
రూ.520తో పది లక్షల బీమా
రూ. 755 ప్రీమియంతో 15లక్షలు

న్యూస్‌ తెలుగు/అమరావతి: మారుతున్న కాలానికి అనుగుణంగా సుదీర్ఘ చరిత్ర కలిగిన తపాలా శాఖ(పోస్టల్‌) కార్యాలయం వినూత్న విధానాలకు శ్రీకారం చుడుతోంది. సామాన్యులకు ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి ఉంది. చాలా మంది ప్రమాద బీమా పథకంపై అశ్రద్ధ చూపడంతో వారి కుటుంబాలు నడి రోడ్డున పడుతున్నాయి. మార్కెట్లో అనేక బీమా ప్లాన్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటిని వాయిదా వేస్తుంటారు. మరికొందరు బీమా ప్రీమియం అధికంగా ఉండటంతో ఆర్థిక స్థోమత లేక వెనకడుగు వేస్తారు. అలాంటి వారికి ప్రయోజనం కోసం పలు కార్పొరేట్‌ సంస్థలు, ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) పర్సనల్‌ గ్రూప్‌ యాక్సిడెంటల్‌ పాలసీ ప్రవేశపెట్టింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ పారదర్శక విధానాలతో తపాలశాఖ ముందుకు పోతోంది. ప్రతి పేద, మధ్య తరగతుల నుంచి ఉన్నత వర్గాలకు సైతం బీమా కల్పనకు తపాలశాఖ ప్రణాళిక రూపొందించింది.ఇందుకోసం కేవలం అతి చిన్న మొత్తంలో చెల్లిస్తే చాలు..లక్షల్లో బీమా వచ్చేలా సరికొత్త ప్లాన్‌ను ఏర్పాటు చేసింది. ఎవరైనా ఒక కుటుంబంలో దురదృష్టవశాత్తూ యజమాని రోడ్డు ప్రమాదంలోగాని, ఇతరత్రాగానీ యాక్సిడెంటల్‌గా దుర్మరణం చెందితే ఈ బీమా వస్తుంది. ఇక్కడ అందించే బీమా పథకం చాలా మందికి ప్రయోజనం చేకూర్చేలా రూపొందింది. ప్రతి సంవత్సరం రూ.520 చెల్లించిన వారికి ప్రమాదవశాత్తు మరణించినా, అంగ వైక్యలం సంభవించినా పది లక్షల బీమా సౌకర్యం కల్పించింది. ప్రతి సంవత్సరం దీనిని రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వాటితోపాటు అనేక బీమా పథకాలను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు బీమా అంటే ఒక్క ఎల్‌ఐసీ ఉండగా, అందుకు దీటుగా తపాలశాఖ సామాన్యులకు ఈ బీమాలను రూపొందించింది.

తపాలశాఖలో విభిన్న బీమా పాలసీ

తపాలశాఖలో విభిన్న బీమా పాలసీల వివరాలిలా ఉన్నాయి. యాక్సిడెంటల్‌ బీమా పాలసీలను 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయస్సు గల వారికి మాత్రమే వర్తింపజేస్తారు. ఇందులో యాక్సిడెంట్‌ డెత్‌కు రూ.10లక్షల బీమా వర్తిస్తుంది. శాశ్వత వైకల్యానికి రూ.10లక్షలు, ప్రమాదశాత్తు పక్ష వాతం రూ.10లక్షలు బీమా వర్తిస్తుంది. దీంతోపాటు విద్యా ప్రయోజనాలకు రూ.లక్ష, ప్రమాదశాత్తూ వైద్యం రూ.60వేలు (ఇన్‌ పేషెంట్‌), ప్రమాదవశాత్తు వైద్యం రూ.30వేలు (అవుట్‌ పేషెంట్‌), కుటుంబ ప్రయోజనాల ఖర్చుకు రూ.25వేలు, పది రోజులపాటు ఆస్పత్రిలో రోజు వారీ నగదు వెయ్యి రూపాయలు, అంత్య క్రియల ప్రయోజనం ఖర్చు రూ.5వేల చొప్పున వర్తిస్తుంది. ఇందు కోసం పోస్ట్‌ ట్యాక్స్‌ ప్రీమియం రూ.520 చెల్లిస్తే,…రూ.10లక్షల బీమా వర్తిస్తుంది. వాటితోపాటు రూ.755 అతి తక్కువ ప్రీమియంతో రూ.15 లక్షల ప్రమాద బీమా చెల్లించే అవకాశం కల్పించింది. ఈ బీమా పొందాలంటే ఇండియన్‌ తపాలా శాఖ కార్యాలయంలో ఖాతా తప్పనిసరిగా తెరవాలి. ఈ పాలసీ కోసం సమీపంలోని తపాలా శాఖ కార్యాలయానికి సంప్రదిస్తే పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే ఎన్నో కటుంబాలు ఈ బీమాను సద్వినియోగం చేసుకున్నాయి.

లాజిస్టిక్స్‌ సంస్థగా తపాలాశాఖ

150 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన, ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టల్‌ నెట్‌వర్క్‌ అయిన ఇండియా పోస్ట్‌ను 1.5 లక్షల గ్రామీణ తపాలా కార్యాలయాలతో పెద్ద లాజిస్టిక్స్‌ సంస్థగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌తో 1.5 లక్షల గ్రామీణ తపాలా కార్యాలయాలు, 2.4 లక్షల మంది డాక్‌ సేవకుల విస్తృత నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాయి. ప్రధానంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇదెంతో తోడ్పాటు ఇస్తోంది. తపాలశాఖను లాజిస్టిక్స్‌ సంస్థగా మార్చడం వల్ల వచ్చే మూడు, నాలుగేళ్లలో శాఖ ఆదాయం 50 నుంచి 60 శాతం పెరిగే అవకాశముంది. 2029 నాటికి తపాలశాఖను లాభదాయకంగాను, లాజిస్టిక్స్‌ కంపెనీగాను మార్చడానికి కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వస్తువుల డెలివరీ సేవలను పెంపొందించడానికి చర్యలు చేపడుతున్నారు. ఉత్తరాల డెలీవరీతోపాటు ఇండియా పోస్ట్‌ బ్యాంకింగ్‌ సేవలు, పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (పీఎల్‌ఐ), రూరల్‌ పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (ఆర్‌పీఎల్‌ఐ) ద్వారా జీవిత బీమా, బిల్లు చెల్లింపులు వంటి రిటైల్‌ సేవలు, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ వేతనాలు పంపిణీలో తపాలశాఖ భాగస్వామ్యం అయ్యేలా కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా వివిధ బీమా పథకాలను ప్రవేశపెట్టి..సామాన్యులకు మరింతగా తపాలశాఖ చేరువైంది. ఏదేమైన‌ప్ప‌టికీ, త‌పాలాశాఖ ఒక కొత్త రూపును సంత‌రించుకుంటోద‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. (Story: సామాన్యులకు వరం: పోస్ట‌ల్‌లో అదిరిపోయే బీమా ప‌థ‌కాలు)

Follow the Stories:

కొత్త రేషన్‌ కార్డులొస్తున్నాయి!

జ‌గ‌న్‌..జ‌స్ట్ ఫైవ్ మినిట్స్‌! అలా వచ్చి..ఇలా వెళ్లి..!

జగన్‌ టీమ్‌కు అనర్హత భయం!

సిటీ కిల్ల‌ర్ వ‌చ్చేస్తోంది! ముంబ‌యికి ముప్పు?

స‌డెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్‌!

నిరుద్యోగులకు మోదీ బంప‌ర్‌ ఆఫర్‌!

మారిన జ‌గ‌న్ వ్యూహ‌ర‌చ‌న: జగన్‌ 2.0 అంటే ఇదేనేమో!

మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?

మున్సిపల్‌ పీఠాలపై కూటమి గురి

బట్టలూడదీసి నిలబెడతా!: జగన్‌

జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)

వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైర‌స్‌!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి

దుర్గ‌గుడి ల‌డ్డూ ప్ర‌సాదంలో వెంట్రుక‌లు!

జైల్లో నా భర్తను.. టార్చర్‌ చేస్తున్నారు..!

లైసెన్సుల్లో గోల్‌మాల్‌!

రోజాకు జగన్‌ చెక్‌?

రిజిస్ట్రేషన్‌ శాఖలో డిజిట‌ల్ విప్ల‌వం: లాభ‌మా? న‌ష్ట‌మా?

ఇంటర్‌ విద్యార్థులకు పండుగలాంటి వార్త!

వైసీపీకి ఇంటా, బయటా పోరు

హెల్మెట్ కొత్త రూల్స్‌!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!