Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఏపీ అసెంబ్లీ: గవర్నర్‌ ప్రసంగం హైలైట్స్‌!

ఏపీ అసెంబ్లీ: గవర్నర్‌ ప్రసంగం హైలైట్స్‌!

ఏపీ అసెంబ్లీ: గవర్నర్‌ ప్రసంగం హైలైట్స్‌!

న్యూస్‌తెలుగు/అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోfమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలోని ముఖ్యాంశాలు..

* ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు,
* ప్రజలు కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది.
* ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైంది.
* సూపర్‌ సిక్స్‌ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నాం.
* అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు చేశాం.
* అన్నక్యాంటీన్లు తెచ్చి పేదల ఆకలి తీరుస్తున్నాం.
* కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం.
* వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయింది.
* ప్రతినెలా ఒకటో తేదీనే ఇంటికి వెళ్లి ల‌బ్ధిదారుల‌కు పెన్షన్ అందిస్తున్నాం.
* పెన్షన్లు రూ. 4 వేలకు పెంచాం.
* కూటమి ప్రభుత్వంలో తలసరి ఆదాయం పెరిగింది.
* అవకాశాలిస్తే ప్రతి ఒక్కరూ మెరుగైన సేవలు అందిస్తారు.
* 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తాం.
* పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు, విద్య, వైద్యం అందజేస్తున్నామన్నాం.
* మౌలికవసతులపై ప్రత్యేక దృష్టి సారించాం.
* బీసీ వర్గాల ఉన్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాం.
* స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాం.
* ఏడాదికి 2 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం.
* పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించాం.
* స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగిపోయింది.
* అర్హులైన పేదలందరికీ సొంతిల్లు ఉండాలనేది మా ఆకాంక్ష.
* ప్రతి కుటుంబానికి రక్షిత తాగునీరు, విద్యుత్‌ అందజేస్తున్నాం.
* ఐటీ నుంచి ఏఐ రివల్యూషన్‌ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
* సంక్షేమం, అభివృద్ధి సమన్వయం చేసుకుంటున్నాం.
* ఎన్టీఆర్‌ వైద్యసేవా ట్రస్ట్‌ ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందజేస్తున్నాం.
* మన బడి- మన భవిష్యత్తు ద్వారా స్కూల్స్‌లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం.
* పీ-4 విధానం ద్వారా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నాం.
* మెరిట్‌ ఆధారంగా 9 యూనివర్సిటీలకు వీసీలను నియమించాం.
* స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధన ఎత్తివేశాం.
* కూటమి ప్రభుత్వం వచ్చాక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాం.
* ఐటీఐలు, పాలిటెక్నిక్‌ల్లో 200 స్కిల్‌ హబ్‌లు ఏర్పాటు చేశాం.
* తల్లికి వందనం పథకాన్ని తీసుకువస్తున్నాం
* తొలిసారిగా స్కిల్‌ సెన్సెన్స్‌ నిర్వహిస్తున్నాం.
* ప్రతి ఇంటికి ఓ వ్యాపారవేత్త ఉండాలనేది మా లక్ష్యం.
* దేశంలోనే ఐటీలో ఏపీని టాప్‌లో నిలిపేలా కొత్త ఐటీ పాలసీ తీసుకొచ్చాం.
* ఉద్యోగాలు, నైపుణ్య హబ్‌గా ఏపీని మార్చేలా ప్రయత్నం చేస్తున్నాం.
* వైసీపీ ప్రభుత్వం నిలిపిన 93 కేంద్ర పథకాల్లో 74 పునరుద్ధరించాం.
* నీటిపారుదల, రోడ్ల సంబంధిత రూ.10,125 కోట్ల బిల్లులు క్లియర్‌ చేశాం.
* ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం.
* భూగర్భ జలాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
* వెలిగొండను త్వరలోనే పూర్తి చేస్తాం.
* 48 గంటల్లోనే ధాన్యం కొనుగోళ్లకు డబ్బులు చెల్లిస్తున్నాం.
* 10 పోర్టులను అంతర్జాతీయ పోర్టులుగా అభివృద్ధి చేస్తున్నాం.
* 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం.
* పోలవరం- బనకచర్ల పూర్తయితే రాయలసీమలో కరువు ఉండదు.
* రాష్ట్రంలో సూర్య ఘర్‌ యోజన కింద సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేశాం.
* మా ప్రభుత్వ చర్యలతో టూరిజంలో పెట్టుబడులు పెరిగాయి.
* ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు అండగా ఉన్నాం. అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నాం.
* యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది.
* వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్థిక పతనం అంచుకు చేరింది.
* రాష్ట్రానికి జరిగిన నష్టంపై 7 శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు తెలిపాం.
* వైసీపీ పాలనలో వనరుల మళ్లింపు, భారీగా సహజవనరుల దోపిడీ జరిగింది.
* 2029 నాటికి విశాఖలో 46 కి.మీ మెట్రో నిర్మాణం జరుగుతుంది
* విజయవాడలో 38.40 కి.మీ మెట్రో రైల్‌ నిర్మాణం చేపట్టనున్నాం.
* ఎనర్జీ రంగంలో 7.5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం.
* 3 నెలల్లోనే 17,605 కిలో మీటర్ల రోడ్లకు మరమ్మతులు చేపట్టాం.
* 2025-26లో విద్యుత్‌ ఛార్జీల పెరుగుదల ఉండదు.
* 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా రూఫ్‌టాప్‌ సోలార్‌ ఏర్పాటు చేశాం.
* రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించేలా వ్యవసాయ ఫీడర్ల సోలరైజేషన్‌ ఏర్పాటు చేశాం. (Story: ఏపీ అసెంబ్లీః గవర్నర్‌ ప్రసంగం హైలైట్స్‌!)

Follow the Stories:

జ‌గ‌న్‌..జ‌స్ట్ ఫైవ్ మినిట్స్‌! అలా వచ్చి..ఇలా వెళ్లి..!

జగన్‌ టీమ్‌కు అనర్హత భయం!

సిటీ కిల్ల‌ర్ వ‌చ్చేస్తోంది! ముంబ‌యికి ముప్పు?

స‌డెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్‌!

నిరుద్యోగులకు మోదీ బంప‌ర్‌ ఆఫర్‌!

మారిన జ‌గ‌న్ వ్యూహ‌ర‌చ‌న: జగన్‌ 2.0 అంటే ఇదేనేమో!

మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?

మున్సిపల్‌ పీఠాలపై కూటమి గురి

బట్టలూడదీసి నిలబెడతా!: జగన్‌

జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)

వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైర‌స్‌!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి

దుర్గ‌గుడి ల‌డ్డూ ప్ర‌సాదంలో వెంట్రుక‌లు!

జైల్లో నా భర్తను.. టార్చర్‌ చేస్తున్నారు..!

లైసెన్సుల్లో గోల్‌మాల్‌!

రోజాకు జగన్‌ చెక్‌?

రిజిస్ట్రేషన్‌ శాఖలో డిజిట‌ల్ విప్ల‌వం: లాభ‌మా? న‌ష్ట‌మా?

ఇంటర్‌ విద్యార్థులకు పండుగలాంటి వార్త!

వైసీపీకి ఇంటా, బయటా పోరు

హెల్మెట్ కొత్త రూల్స్‌!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!