జగన్ టీమ్‌కు అనర్హత భయం!
వైసీపీకి 60 దినాల హాజరు టెన్షన్
లేకుంటే సభ్యత్వం రద్దవుతుందన్న చర్చ
అసెంబ్లీకి వెళ్లేందుకు వైసీపీ ఎమ్మెల్యేల సిద్ధం
రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు
న్యూస్‌తెలుగు/అమరావతి: మరికొన్ని గంటల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా, వైసీపీ ఎమ్మెల్యేల్లో మాత్రం టెన్షన్ పెరుగుతోంది. మాజీ సీఎం వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారా?, జగన్‌లో అనర్హత వేటు భయం పట్టుకుందా?, అందుకే ఈ బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలని జగన్ ఎమ్మెల్యేల టీం నిర్ణయించుకుందా? అనే ప్రశ్నలు రాజకీయంగా చర్చానీయాంశమయ్యాయి. రాజ్యాంగంలోని 101లో క్లాజ్ 4 ప్రకారం..ఏ సభ్యుడైనా వరుసగా 60 రోజులు సభకు హాజరుకాకపోతే ఆ సభ్యుడిని అనర్హులుగా చేసే అధికారం సభాపతికి ఉంటుంది. స్పీకర్ డిక్లేర్ చేసిన తర్వాత ఎన్నికల కమిషన్‌కు పంపితే అనర్హత వేటు పడుతుంది. అది జరుగుతుందనే భయంతోనే జగన్ అసెంబ్లీకి రావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు అసెంబ్లీకి వెళ్లబోనని, అక్కడకు వెళ్తే తాను చెప్పాల్సిన రీతిలో సమయం ఉండబోదని జగన్ చెప్పుకొస్తున్నారు. అదీ రీతిలో ఇప్పటివరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకసారి ప్రమాణ స్వీకారంతోపాటు మరోసారి గవర్నర్ ప్రసంగం సమయంలో తన ఎమ్మెల్యేలతోపాటు జగన్ వెళ్లి నిరసనలు తెలిపి వచ్చారు. తర్వాత జరిగిన అసెంబ్లీ సెషన్లకు వెళ్లలేదు. ఈనెల 26వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు జగన్ తన ఎమ్మెల్యేలతో హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి గురైంది. కేవలం 11 ఎమ్మెల్యేలే ఆ పార్టీ నుంచి గెలుపొందారు. అధికార కూటమి(టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత..ఇక రెండో పార్టీగా ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ పట్టుపడుతున్నారు. దీనిపై కూటమి నేతలు సంఖ్యా బలంతోనే ప్రతిపక్షం వస్తుందని వాదిస్తున్నారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న దానిపైనా హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం కొనసాగుతున్న తరుణంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వచ్చాయి. అటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు తొమ్మిది నెలలు పూర్తవుతోంది.
ప్రతిపక్ష హోదాపై జగన్ పట్టు
ప్రతిపక్షనేత హోదా ఇస్తేనే శాసనసభ సమావేశాలకు హాజరవుతానని జగన్ పట్టు పట్టారు. ఈనెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 2025-26 వార్షిక బడ్జెట్ సమావేశాలకు తన ఎమ్మెల్యేలతో కలిసి జగన్ హాజరయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. తొలిరోజు సభలో జరిగే గవర్నర్ ప్రసంగానికి వీరంతా హాజరవుతారు. ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కకపోయినా, విపక్ష హోదా కోసం ఇన్నాళ్లుగా ఆయన వాదిస్తూనే ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో తాను వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ క్రమంలో అసెంబ్లీ నిబంధనల ప్రకారం వరుసగా అరవై రోజులు ఏ కారణం లేకుండా, సమాచారం ఇవ్వకుండా నిరవధికంగా సభకు గైర్హాజరు అయితే సభ్యుల సభ్యత్వం రద్దవుతుందని అనేక సార్లు అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ అసెంబ్లీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అధికారికంగానే ప్రకటించిన విషయం విదితమే. దీంతో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల్లో అలజడి మొదలైంది. ప్రస్తుత తరుణంలో ఆ పార్టీ సభ్యుల సభ్యత్వం రద్దయి..ఉప ఎన్నికలు వస్తే..పరిస్థితి ఏమిటనేదీ వైసీపీలో చర్చ మొదలైనట్లు సమాచారం. దీంతో అనివార్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు జగన్ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది.
సభ్యత్వం రద్దు నుంచి తప్పుకునేందుకేనా?
వరుసగా అసెంబ్లీ సమావేశాలకు 60 పనిదినాలపాటు హాజరుకపోతే..ఆ సభ్యుడి సభ్యత్వం రద్దువుతుంది. ఏ సభ్యుడైనా 60 పనిదినాలు సభకు రాకపోతే అతనిపై వేటు వేసేందుకు అసెంబ్లీ స్పీకర్‌కు హక్కు ఉంటుంది. దీనిపై రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు చాలా సందర్భాల్లో చెప్పారు. ఈ పరిస్థితుల్లో జగన్ తన ఎమ్మెల్యేలతోపాటు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాల సమయంలో సోమవారంనాడు అసెంబ్లీ, మండలి సభ్యులతో జరిగే ఉమ్మడి సమావేశంలో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఈ సమావేశానికి జగన్ తన ఎమ్మెల్యేలతో వెళ్లి సూపర్ సిక్స్ హామీలపై కొంతసేపు నిరసనలు తెలిపి..ఆ తర్వాత బాయ్‌కౌట్ చేసి వస్తారని తెలిసింది. జగన్ భయపడే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడంలేదన్న వాదన సరికాదని, ఆయనలో మార్పు వచ్చిందని కొందరు చెబుతున్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తర్వాత వేరే కార్యకలాపాలు లేకుండానే సభ ఆ రోజుకు వాయిదా పడుతుంది. మరుసటి రోజు మంగళవారం సమావేశమవుతుంది. దీంతో జగన్, ఎమ్మెల్యేలు తొలి రోజే వస్తారా? లేక బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేవరకు ఉంటారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ సమావేశమై..వారికి దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీకి జగన్ టీమ్ మొక్కుబడిగా వెళ్లినా, వెళ్లకపోయినా..శాసన మండలిలో ఈ సారి కూడా బలంగా వాదనలు విన్పించాలన్న వ్యూహంతో వైసీపీ ఉంది. శాసన మండలిలో కూటమి పార్టీల ఎమ్మెల్సీల కంటే వైసీపీ ఎమ్మెల్సీలే అధికంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ వారు గత సమావేశాల్లో ప్రశ్నించారు. ఇప్పుడు ఇదే బాటలో వెళ్లేందుకు వైసీపీ నిర్ణయించుకుంది. అసెంబ్లీ సమావేశాలు 24వ తేదీ సోమవారం ప్రారంభమవుతాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. మరునాడు దానిపై చర్చ కొనసాగుతుంది. 26వ తేదీ శివరాత్రి కారణంగా అసెంబ్లీకి సెలవు, మరునాడు కూడా సెలవు ఉంటుంది. 28వ తేదీన రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఏదేమైనప్పటికీ, ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆసక్తికరంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. (Story: జగన్ టీమ్‌కు అనర్హత భయం!)
Follow the Stories:
సిటీ కిల్లర్ వచ్చేస్తోంది! ముంబయికి ముప్పు?
సడెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్!
నిరుద్యోగులకు మోదీ బంపర్ ఆఫర్!
మారిన జగన్ వ్యూహరచన: జగన్ 2.0 అంటే ఇదేనేమో!
మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)
వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైరస్!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి
దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు!
జైల్లో నా భర్తను.. టార్చర్ చేస్తున్నారు..!
రిజిస్ట్రేషన్ శాఖలో డిజిటల్ విప్లవం: లాభమా? నష్టమా?