శ్రీ వీరాంజనేయస్వామి ఆలయ ప్రారంభోత్సవం
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దంపతులు
న్యూస్‌తెలుగు/వనపర్తి : 3వ వార్డ్ శ్రీ సీతారామలక్ష్మణ సహిత శ్రీ వీరాంజనేయ స్వామి నూతన ధ్వజస్తంభ,విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో గౌరవ మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి.వాసంతి నిరంజన్ రెడ్డి గార్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణములో జరుగుతున్న యాగంలో పాల్గొన్నారు. వేదపండితులు గౌరవ నిరంజన్ రెడ్డి దంపతులను ఆశీర్వదించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయకమిటి సభ్యులు పి.రమేష్ గౌడ్,వాకిటి.శ్రీధర్,బండారు.కృష్ణ,సూర్యవంశం.గిరి,చిట్యాల.రాము, జోహేబ్,ఇమ్రాన్,మునయ్యా, తదితరులు పాల్గొన్నారు.(Story : శ్రీ వీరాంజనేయస్వామి ఆలయ ప్రారంభోత్సవం)