అగ్నిబాధిత గిరిజన కుటుంబానికి ఇంటి నిర్మాణ సామగ్రి వితరణ
న్యూస్ తెలుగు/ చింతూరు : మండలం లోని కుమ్మురు గ్రామపంచాయతీ పరిధిలో గొర్లగూడెం గ్రామానికి చెందిన మడకం రామ్మూర్తి ఇల్లు ఇటీవలఅగ్నిప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయింది.కట్టుబట్టలతో కుటుంబం రోడ్డున పడింది. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు జే. కే.ట్రస్ట్ ఛైర్మెన్ జమాల్ ఖాన్ బాధిత కుటుంబాన్ని సందర్శించి నారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన సామాగ్రి ఇనుప పైపులు సిమెంట్ రేకులు మొత్తం 30 వేల రూపాయల విలువగల సామగ్రి అందజేశారు.అగ్గి పడి అంత కొల్పోయి తీవ్రంగా నష్టపోయిన కుటుంబానికి ఆయన భరోసా కల్పించారు.ఇంకా ఏదైనా నిర్మాణ ఖర్చులు సామాగ్రి అవసరమైతే సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు రియాజ్,రసూల్,షాజహాన్, గ్రామ పెద్దలు పాల్గోన్నారు. (Story : అగ్నిబాధిత గిరిజన కుటుంబానికి ఇంటి నిర్మాణ సామగ్రి వితరణ)